లీకైన ‘ఖైదీ నెం.150’ మూవీ సాంగ్.. డాన్స్ తో అదరగొట్టిన చిరు, కాజల్!

khaidi no 150 movie video song leaked online

షూటింగ్ టైంలో సెల్‌ఫోన్ కెమెరాల్లో కొన్ని క్లిప్స్‌ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం బాగా జరుగుతోంది. రీసెంట్ గా చిరు నటిస్తున్న ఖైదీ నెం.150 సినిమాకి సంబందించి డాన్స్ లీక్ చేశారు. చిరంజీవి, కాజల్ అగర్వాల్‌పై ఓ సాంగ్ ను చిత్రీకరించగా.. అక్కడే ఉన్న యూనిట్ మెంబర్స్‌లో ఒకరు తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి, ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు.

ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. లీకైన ఈ పాటకి సామాజిక మాధ్యమాల్లో అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో కాజల్ వయ్యారాలుపోతూ నడుము ఊపుతు స్టెప్ వేయగా, అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న చిరు ఒక్కసారిగా ఆమె నడుముని చుట్టేసి స్టెప్ కలిపారు. చిరు ఇచ్చిన ఆ యాక్షన్ చూస్తే.. గతంలో ఉన్న ఎనర్జీనే ఇప్పటికీ ఆయనలో కనిపిస్తుంది. తాను చెప్పిన డైలాగ్‌లాగే.. టైమ్‌లో గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే కానీ, టైమింగ్‌లో ఏమాత్రం ఛేంజ్ లేదు.

ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా ఆడియోని ఈ నెల 25వ గ్రాండ్ గా జరపనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలాకాలం తర్వాత చిరు రీఎంట్రీ ఇస్తుండడంతో.. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటివలే రిలీజ్ చేసి టీజర్ కు మంచి స్పందన వస్తుంది.

Related

  1. ఖైదీ నెం 150 టీజర్ అదిరింది! రికార్డులు బద్దలు కొట్టడం పక్కా!
  2. చిరు సినిమా ఆడియోకి పవర్ స్టార్!
  3. చిరు పెద్ద కూతురు భలే తయారు చేసింది
  4. చిరు కుమార్తె శ్రీజకు షాక్ ఇచ్చిన మాజీ భ‌ర్త

Facebook

Videos