మొగుడితో కలిసి రచ్చ రచ్చ చేసిన అనసూయ

Anchor Anasuya With Her Husband At Dhee Jodi Program

హీరోయిన్లు అయిన యాంకర్స్ అయిన పెళ్ళయిన విషయాన్ని బయటకు పెట్టడానికి భయపడుతుంటారు. స్టార్ హీరోయిన్లకు కూడా వాళ్లకు పెళ్లి జరిగిపోయిందని ఎప్పటికో కూడా చెప్పే అలవాటు చాలామందికి ఉండదు. ఇప్పుడిప్పుడు మారుతున్నారు.. కానీ చాలా వరకు బయట పెట్టరు.

ఈ ట్రెండ్ టాలీవుడ్ లోనే బాగా ఎక్కువగానే ఉంది. పెళ్లి అయిందనో.. కనీసం కుదిరిందనో చెబితే.. ఇక ఛాన్సులు రావని వారి భయం. కానీ హాట్ యాంకర్ అనసూయ మాత్రం డిఫరెంట్ అనిపించుకుంది. ఏకంగా కాళ్ళకు మెట్టెలు పెట్టుకుని మరీ ఫంక్షన్లకు హాజరయిపోయి.. ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఓ ఛానల్ లో వచ్చే డ్యాన్సింగ్ షోకి అయితే.. తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి వచ్చేసింది.

అక్కడ ఇద్దరూ కలసి డ్యాన్సులు వేయడాలు.. బుగ్గలు పిండుకోవడాలు.. ప్రపోజ్ చేసుకోవడాలు.. కౌగిలించుకోవడం.. చిన్న చిన్న ముద్దులు పెట్టేసుకోవడం.. అబ్బో వీరిద్దరి లవ్ ని ఓ రేంజ్ లో చూపించేశారులే. తనకు పెళ్లి అయిందనే సంగతిని దాచుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించని డేరింగ్ మెంటాలిటీ ఆమెది. అలాంటి ఈ హాట్ యాంకర్ ఏకంగా భర్తతో బయటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

Related

  1. అనసూయ బెడ్ రూమ్ వీడియో హల్ చల్!
  2. అభిమానికి క్లాస్ పీకిన అనసూయ! ఎందుకంటే?
  3. అనసూయ, రష్మీ మధ్య వివాదం?
  4. యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!

Facebook

Videos