'అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు' అంటున్న చిరు!

Khaidi No 150 Ammadu lets do Kummudu

మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఓ రెంజ్ లో ఉండబోతున్నాయి అని అర్ధం అవుతోంది. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది.

మరి మాస్ హీరో మెగాస్టార్ మాస్ రచ్చ చేసేయాలని డిసైడ్ అయితే ఎలా ఉంటుందో పూర్తిగా తెలియాలంటే ఇంకా దాదాపు నెల రోజుల టైమ్ ఉంది కానీ.. ఈలోగా ఓ శాంపిల్ వదలదలచుకుంది ఖైదీ యూనిట్. ప్రమోషన్స్ విషయంలో అగ్రెసివ్ గా ఖైదీ టైం.. డిసెంబర్ 18న ఓ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వారం ముందే ఓ శాంపిల్ ఇవ్వబోతున్నారన్న మాట. 'అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు' అంటూ సాగే సింగిల్ ని రేపు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు.

చిరు మాస్ డ్యాన్స్ వేస్తున్న ఓ స్టిల్ ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. పర్పుల్ టీషర్ట్ పైన రెడ్ కలర్ షర్ట్.. కలర్ ఫుల్ గ్లాసెస్.. రగ్గెడ్ జీన్స్.. పైన కట్టిన పచ్చ లుంగీతో చిరు మెలికలు తిరుగుతున్న పోస్టర్ చూస్తుంటే.. మెగా ఫ్యాన్స్ కి మైకం వచ్చేస్తోంది. మరి రేపు విడుదల కాబోతున్న సింగిల్ లో చిరు స్టెప్ కనుక చూపించారంటే.. ఇక యూట్యూబ్ లో రచ్చ రచ్చే.

Related

  1. చిరుకు అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!
  2. లీకైన ‘ఖైదీ నెం.150’ మూవీ సాంగ్.. డాన్స్ తో అదరగొట్టిన చిరు, కాజల్!
  3. చిరు సినిమా ఆడియోకి పవర్ స్టార్!
  4. ముందుగానే రాబోతున్న చిరు!

Facebook

Videos