ఖైదీ నెం.150 గురించి చిరు షాకింగ్ కామెంట్స్!

megastar chiranjeevi at 2017 maa dairy inauguration

మెగా అభిమానులతో పాటు అందరూ చిరు ఖైదీ నెం.150 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తుండగా... చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నానని.. ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలానే ‘ఇదిరా చిరంజీవి అంటే అని’ కాలర్ ఎగరేసుకునేలా ఖైదీ నెం.150 ఉందబోతుందని చిరు చెప్పుకొచ్చారు.

గురువారం చిరంజీవి నివాసంలో ‘2017 మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేన్‌’ (మా) డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అసోషియేషన్ సభ్యులు చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం 150కి శూభాకాంక్షలను తెలియచేసి.. కేక్ కట్ చేయించారు.

150 పుష్పాలతో అలంకరించిన పుష్పగుచ్చాన్ని అందించారు. దీంతో..  ‘మా’ బృందాన్ని, ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చిరు మాట్లాడుతూ... మీరంతా గర్వపడేలా ఓ సినిమా ఉంటుందని.. ఇంతకు ముందు సినిమాల్లో లాగే ఈ చిత్రంలో కూడా కష్టపడ్డానని మీరందరి ఆశీస్సులతో ఖైదీ నెం.150 ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని అన్నారు. అనంతరం ‘మా’ అసోసియేషన్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి హీరోగా రీ–ఎంట్రీ ఇస్తున్నందుకు ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ బృందం శుభాకాంక్షలు తెలిపారు.

Related

  1. చిరు టార్గెట్ తెలుస్తే షాక్ అవుతారు!
  2. చిరుకు అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!
  3. లీకైన ‘ఖైదీ నెం.150’ మూవీ సాంగ్.. డాన్స్ తో అదరగొట్టిన చిరు, కాజల్!
  4. 'అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు' అంటున్న చిరు!

Facebook

Videos