నడిసొచ్చే నర్తన శౌరి.. పవన్ న్యూ ఇయ‌ర్ కానుక‌

pawan kalyan new year gift

పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని పవన్ కాటమరాయుడు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాని ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మ‌రార్ నిర్మిస్తున్నారు.

గోపాల‌…గోపాల డైరెక్ట‌ర్ డాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్‌లో అజిత్ హీరోగా తెర‌కెక్కి హిట్ అయిన వీర‌మ్‌ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ప‌వ‌న్ అభిమానులకు రెండు గుడ్ న్యూస్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

న్యూ ఇయ‌ర్ కానుక‌గా కాట‌మ‌రాయుడు పోస్ట‌ర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. పవన్ నడస్తున్న ఈ పోస్టర్ అద్బుతంగా ఉంది. పంచకట్టులో పవన్ ఏ రెంజ్ లో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ప్రస్తుతం ఈ పోస్ట‌ర్ సొషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ప‌వ‌న్ స‌ర‌స‌న శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా విడుదల తేది ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో ఉగాది కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయలని చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోలాచిలో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Related

  1. పవన్ కళ్యాణ్ ఏపీ ని గాలికి వదిలేసాడు !
  2. పవన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చిరు!
  3. అయ్యో.. పవన్ , ప్రభాస్ లకు ఇది నింజంగా చేదు వార్తే
  4. పవన్ కళ్యాణ్ కి మామగా సూపర్ స్టార్..?

Facebook

Videos