ఖైదీ నెంబర్.150 గురించి చెప్పిన సెన్సార్‌ సభ్యులు!

khaidi no 150 censor report

ఇప్పుడు సెన్సార్‌ టాక్‌.. పబ్లిసిటీ వ్యవహారంగానే అయ్యింది. సెన్సార్‌ సభ్యులు తమ సినిమా చూసి బాగుందన్నారని ప్రచారం చేసుకుంటూ పబ్లిసిటీ మొదలు పెడుతారు సినిమా జనాలు.  ఈ సంక్రాంతికి రాబోతున్న 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి సంబంధించి సెన్సార్‌ టాక్‌ అంటూ ఓ రిపోర్ట్‌ బయటకి వచ్చింది. మెగా ఫ్యాన్స్ ఈ రిపోర్టును సోషల్‌ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు.  అయితే ఈ చిత్రం చూడడానికి ఎప్పుడూ లేనంతగా మొత్తం 18 మంది సెన్సార్‌ సభ్యులూ ఈ సినిమాని చూసారట.

సినిమా పూర్తయ్యాక మొత్తం అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారట. మెగాస్టార్‌ యాక్టింగ్‌‌కు, డ్యాన్స్‌లకు అందరూ ఫిదా అయ్యారట. సంక్రాంతి కానుక‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ తాజాగా పూర్త‌యింది. యు బై ఏ స‌ర్టిఫికెట్ ద‌క్కించుకున్న ఈ సినిమా 147నిముషాలు ర‌న్ టైమ్ కలిగి ఉంది. రైతుల బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది ఈ సినిమా.

ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభిన‌యంలో క‌నిపిస్తాడు. దాదాపు 9ఏళ్ల త‌ర్వాత క‌నిపించినా.. చిరంజీవి స్క్రీన్ అప్పియ‌రెన్స్‌, మేజిక్ ఏమాత్రం త‌గ్గ‌లేదట‌. న‌ట‌న‌, డ్యాన్స్‌లు, కామెడీ టైమింగ్‌లో చిరంజీవి అద్భుతంగా క‌నిపించాడ‌ని సెన్సార్ వ‌ర్గాలు చెప్పాయ‌ట‌. ఈ వయసులో కూడా మెగా స్టార్ చిరంజీవి ఈ చిత్రంలో మరీ యంగ్ గా కనిపించడం మెగా ఫ్యాన్స్ కె కాదు యావత్ ప్రేక్షకులకు కూడా షాకిచ్చేలా ఉంటాడట. మొత్తంగా చిరు చిత్రం సూపర్ హిట్ అన్నది పక్కా అంటున్నారు. ఇక రికార్డుల మోత ఏ రెంజ్ లో ఉంటుందో చూడాలి.

Related

  1. ఖైదీ నెం.150 గురించి చిరు షాకింగ్ కామెంట్స్!
  2. పవన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చిరు!
  3. చిరు టార్గెట్ తెలుస్తే షాక్ అవుతారు!
  4. 'అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు' అంటున్న చిరు!

Facebook

Videos