ఖైదీ నంబర్ 150 ఎంత మంది హీరోయిన్స్ ఉన్నారంటే..?

SHriya in Chiranjeevi Khaidi No 150 Movie

ఖైదీ నంబర్ 150 సినిమా విడుదలకు అంత సిద్ధం అయ్యింది. ఈ సినిమా ఖైదీ నంబర్ 150 ఈవెంట్ కోసం థియేట్రికల్ ట్రైలర్ ను వాయిదా వేయాల్సి వచ్చింది కానీ.. అది కూడా రిలీజ్ అయ్యి ఉంటే ఈ పాటికి మెగా రచ్చ ఏ రెంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. కోలీవుడ్ కత్తికి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి దర్శకుడు వివి వినాయక్ చాలానే మార్పులను చేశాడట. ఈ సినిమాలో ఆల్రెడీ కాజల్ అందాలు లక్ష్మీ రాయ్ చిందులతో హీటెక్కిన  ఖైదీ నంబర్ 150 సినిమాలో శ్రియ కూడా కనిపించనుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

ఇప్పటివరకూ విడుదల చేయని చిరంజీవి పాత్రకు సంబంధించిన లుక్ ఒకటి.. ఖైదీ నంబర్ 150 లో ఉంటుంది. సాఫ్ట్ గా కనిపించే ఆ రోల్.. హైడ్రాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పాత్ర. ఆ రోల్ కు జోడీగా శ్రియతో నటింపచేశారని అంటున్నారు.

ఒరిజినల్  లో శ్రియ రోల్ ఉండదుకానీ.. తెలుగు వెర్షన్ కి మరింత గ్లామర్ అద్దడంతో పాటు.. సెంటిమెంట్ ని రిపీట్ చేయడం కోసం ఈ పాత్రను ఎంటర్ చేశారని టాక్. ఇది మురుగదాస్ కథతో వస్తున్న సినిమా అనే సంగతి తెలిసిందే. గతంలో కూడా ఠాగూర్ సినిమాని కూడా ఇలాగే మురుగదాస్ స్టోరీతో.. వినాయక్ డైరెక్షన్లో శ్రియ హీరోయిన్ గా తీసి బ్లాక్ బస్టర్ సాధించారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని రిపీట్ చేయడం కోసం.. ఓ చిన్న పాత్రను శ్రియకోసం రూపొందించారట. స్క్రీన్ మీద కొద్ది సేపు మాత్రమే కనిపించే ఈ పాత్రను.. ఆడియన్స్ ను థ్రిల్ చేయడం కోసం రివీల్ చేయడం లేదట ఖైదీ యూనిట్.

Related

  1. లీకైన ‘ఖైదీ నెం.150’ మూవీ సాంగ్.. డాన్స్ తో అదరగొట్టిన చిరు, కాజల్!
  2. ఖైదీ నెం.150 గురించి చిరు షాకింగ్ కామెంట్స్!
  3. సుందరితో ఖైదీ.. అదిరిపోయింది!
  4. ఖైదీనెం.150 కాపీ కొట్టి అడ్డంగా దొరికిన దేవిశ్రీ

Facebook

Videos