నవదీప్ ను అనసూయ అలా చూడాలనుకుంటుంది

anchor anasuya comments on hero navadeep a date with anasuya

బుల్లితెరతోపాటు వెండి తెరపై తన సత్తా చూపిస్తోంది హాట్ యాంకర్ అనసూయ. జబర్దస్త్ కామెడీ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాప్ హీరోల సరసన చాన్స్ కొట్టేసిని ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో జోరును మరింత పెంచింది. యాంకర్‌గా తన హవాను చూపిస్తూనే పలు టివి చానల్స్ నిర్వహించే స్పెషల్ ప్రోగ్రామ్స్ లోనూ తలుక్కుమంటోంది.

ఈ మధ్య అనసూయ ‘ఏ డేట్ విత్ అనసూయ’ పేరుతో ఓ ప్రొగ్రామ్ చేసింది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ఈ వారం సెలబ్రిటీగా వస్తున్నారంటూ ప్రోమోను రిలీజ్​ చేశారు. ఇందులో అనసూయ నవదీప్‌ని తనదైన శైలిలో కొన్ని ప్రశ్నలు అడిగింది. ‘మీకు మేం మూడు కాస్ట్యూమ్స్ ఇస్తాం..

సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మేన్ అందులో ఏది వేసుకుంటారో చెప్పాలంటూ క్వచ్చన్ వేయడం, దాని నవదీప్ బ్యాట్‌మేన్ డ్రెస్ వేసుకుంటా అనడంతో... అనసూయ చాలా నిరుత్సాహ పడుతూ మీరు సూపర్‌మ్యాన్ డ్రెస్ అంటారనుకున్నా అని, ఆ డ్రెస్ వేసుకుంటే నాకు టైం పాస్ అయినట్లు ఉంటుందని తెగ సిగ్గుపడిపోయింది. దీనికి మన యంగ్ హీరో ఊరుకుంటాడా.. మీకు సూపర్‌మేన్ అండర్‌వేర్ చూడాలని ఆశ.. లేక నేను అండర్‌వేర్ వేసుకుంటే చూడాలని ఆశ అంటూ సెటైర్ వేశాడు. అంతటితో అపకూండా ఒకటే నవ్వులు, స్టెప్పులూ అబ్బో ప్రోమో మొత్తం "‘ఏ డేట్ విత్ అనసూయ’ ప్రోగ్రామ్‌కి తగ్గట్లే ఉంది. ప్రోమోనే ఇలా ఉందంటే.. ఇక ప్రోగ్రామ్‌ ఎలా ఉండబోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related

  1. మరో సారి తన లుక్స్ తో రెచ్చగొడుతున్న అనసూయ!
  2. పవన్ సరసన యాంకర్ అనసూయ!
  3. మొగుడితో కలిసి రచ్చ రచ్చ చేసిన అనసూయ
  4. అనసూయ బెడ్ రూమ్ వీడియో హల్ చల్!

Facebook

Videos