ఐటెం గర్ల్స్ గా మారుతున్న తెలుగు హీరోయిన్లు!!

Tollywood Heroine Turns Item Girls

ఒకప్పటి  టాలీవుడ్ హీరోయిన్లు కేవలం.. హీరోయిన్ల పాత్రల్లో మాత్రమే నటించేవారు. తర్వాత తరం హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ హీరోలకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు. అయితే ప్రస్తుత కధానాయికలు మాత్రం మరో అడుగు ముందుకేసి ఐటెం సాంగ్స్ లో కూడా నటిస్తున్నారు. ఇందుకు టాప్ హీరోయిన్లు కూడా మినహాయింపు కాదు.  

ఈ ఐటెం సాంగ్స్ లో నటించడానికి  ఎక్కువ రెమ్యూన్ రేషన్స్ ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్స్ వెనకాడడం లేదు. దీంతో హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటువంటి హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. జనతా గ్యారేజ్ లో.. నేను  పక్కా లోకల్ అంటూ ఐటెం డాన్స్ ఇరగదీసింది కాజల్. ఆగడు సినిమాలో శృతిహాసన్.. జంక్షన్ లో అంటూ చిందేసింది.

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా.. అల్లుడు శీనులో లబ్బర్ బొమ్మగా కనువిందు చేసింది. అంజలి.. సరైనోడులో బ్లాక్ బస్టర్ అంటూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఛార్మీ.. ఢమరుకంలో ఛాయ్.. ఛా ఛా ఛాయ్ అంటూ చెలరేగిపోయింది. ఇక హంసానందిని.. లెజెండ్ లో లస్క్ టపా పాటలో, శ్రియ.. తులసిలో చికు చికు బండినిరో అంటూ ఐటెం సాంగ్స్ లో నటించారు. ఇక ఫ్యూచర్ లో ఇంకెంతమంది హీరోయిన్లు ఐటెం  సాంగ్స్ చేయనున్నారో చూడాలి.

Related

  1. సమంత.. హీరోయిన్ ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు!
  2. వ్యభిచార గృహం నడుపుతున్న హీరోయిన్ విద్యాబాలన్!
  3. ప్ర‌భాస్ హీరోయిన్ కి బ్లూ ఫిల్మ్ చాన్స్!
  4. ఖైదీ నంబర్ 150 ఎంత మంది హీరోయిన్స్ ఉన్నారంటే..?

Facebook

Videos