పెళ్లయిన నాలుగో రోజే.. నన్ను ఏడిపించాడు.. నిజాలు చెప్పిన హరితేజ

actress hari teja talks about her marriage life

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘అ..ఆ’ చిత్రంలో హీరోయిన్ సమంత పక్కన ‘మంగమ్మ’గా నటించి అందరిని ఆకట్టుకుంది హరితేజ. బుల్లి తెరపై ‘మనసు మమత’ అనే సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ఇటివలే ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.. తన లైఫ్ సీక్రెట్స్ గురించి ఎన్నో విషయాలు చెబుతూ.. తన పెళ్లి గురించి కూడా తెలిపింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే చూద్దాం... రెండేళ్ల క్రితం దీపక్ అనే వ్యక్తితో మ్యాచ్ వచ్చింది.. అంత సరే అనుకున్న సమయంలో.. అన్ని రకాల సర్టిఫికెట్స్‌ని చూపించమని మా నాన్న దీపక్‌ని అడిగారు.

నా మీద మంచి కేరింగ్ ఉండటం వల్ల మా నాన్న అలా అడిగారు. ఆ విషయం మన మధ్యే ఉంటుందని.. ఓ స్నేహితుడిగా అనుకొని చూపించమని నాన్న అడిగారు. అలా అడగటంతో దీపక్ కి చాలా కోపం వచ్చింది. నా మీద నమ్మకం లేకే మీరు ఇలా అడుగుతున్నారని.. కోపంగా దీపక్ వెళ్లిపోయాడు. దాంతో నా పెళ్లి ఆగిపోయింది. మళ్లీ సరిగ్గా రెండు సంవత్సారల తర్వాత దీపక్ నన్ను కలిసి.. జరిగిదేదో జరిగింది.. మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. నా ప్రొఫెషన్‌కి అడ్డు చెప్పకుంటే సరే అన్నాను.

అని హరితేజ తన పెళ్లి గురించి చెప్పింది. అయితే పెళ్లి జరిగిన నాలుగో రోజే తనకు ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఆ సంగతులను కూడా చెప్పింది. అప్పటికి మా పెళ్లి జరిగి నాలుగో రోజు.. సాయంత్రం దీపక్ తో బయటకు వెలుదాం అని రెడీ అయ్యాను. దీపక్ ఆఫీస్ నుంచి రాగానే... జిమ్ కి వెళ్లాడానికి రెడీ అయ్యాడు.. నన్ను అడిగాడు వస్తావా అని.. నేను రాను అని చెప్పడంతో తను వెళ్లిపోయాడు. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించి.. ఏడుపు వచ్చేసింది. బాగా బాధపడి అమ్మకు చెప్పాను. అబ్బాయిలు మెల్లగా మారుతారు అని అమ్మ నాకే క్లాస్ పీకింది. ఆ తర్వాత దీపక్‌కి ఫిట్నెస్‌పై ఇష్టాన్ని గుర్తించి.. నేను కూడా జిమ్‌కి వెళ్లడం మొదలు పెట్టా.. అని హరితేజ చెప్పింది.

Related

  1. ప్ర‌భాస్ హీరోయిన్ కి బ్లూ ఫిల్మ్ చాన్స్!
  2. యంగ్ హీరో మోజులో శ్రీముఖి.. షాక్ లో రవి!
  3. టాలీవుడ్ యంగ్ హీరోతో లేడీ డైరెక్ట‌ర్‌ ఎఫైర్!
  4. న్యూ ఇయర్ అర్ధరాత్రి అమ్మాయితో దొరికిన టాలీవుడ్ హీరో

Facebook

Videos