ఖైదీ నెంబ‌ర్ 150 ప్రీ రివ్యూ

khadi no 150 pre review

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరు నటిస్తున్న చిత్రం  ఖైదీ నెంబ‌ర్ 150. తమిళంలో సూపర్ హిట్ అయిన క‌త్తి సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ చిత్రంకు వివి.వినాయ‌క్ దర్శకత్వం వహిస్తుండగా.. చిరు స‌తీమ‌ణి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా స్టోరీ.. స్క్రీన్ ప్లే.. ఇతర విభాగంలో ఎలా ఉండబోతుందో ఆద్యాన్యూస్.కామ్ ఫ్రీ రివ్యూలో ఓ లుక్కేద్దాం..

ఖైదీ నెంబ‌ర్ 150 స్టోరీ అంచ‌నా :

ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా కథ చాలా వరకు అందరికి తెలిసిందే. ఓ యువ‌కుడు రైతులకు వచ్చిన సమస్యపై ఎలా పోరాట‌మే చేసాడు అనేది ఈ చిత్ర ముఖ్యమైన థీమ్‌. రైతులు క‌ల్తీ ఎరువుల వాడటం వల్ల ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీ నిర్మించాలని.. రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూసేక‌ర‌ణ చేస్తుంటుంది. కార్పొరేట్ కంపెనీలు భూ, జ‌ల‌వ‌న‌రుల‌ను దోపిడీ జరగడం వల్ల రైతుల వ్య‌వ‌సాయంపై ఆ ప్ర‌భావం పడటంతో.. వారు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటూ ఉంటారు. రైతుల కోసం పోరాటం స్టార్ట్ చేసిన హీరో చివ‌ర‌కు ప్ర‌భుత్వ పునాదులు క‌దిలేలా చేయ‌డంతో పాటు ప్ర‌జా వ్య‌వ‌స్థ‌ను స్తంభింప‌చేస్తాడు. మరి చివరికి ప్ర‌భుత్వం ఎలా దిగి వ‌చ్చింది..? రైతుల సమస్యలను ఆ యువ‌కుడు ఎలా తీర్చాడు అనేది ఈ సినిమా కథ.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

అయితే తొమ్మిదేళ్ల తర్వాత చిరు రావడంతో అందరి దృష్టి చిరుపైనే ఉంది. ఇప్పటికే విడుదల అయిన టీజ‌ర్‌, ట్రైలర్, సాంగ్స్ లో చిరు గ్రేస్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌నిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరు డ్యాన్సుల్లోను.. డైలాగ్స్‌లోను కుమ్మేసాడు. మొత్తంగా ఖైదీలో చిరు పాత్రమీదే అంద‌రి దృష్టి ఉండ‌డంతో ఆ భారీ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా చిరు పెర్పామెన్స్ ఉందట. ఇక చిరు సరసన కాజ‌ల్‌కు ఈ కథలో ఎలాంటి రోల్ ఉంటుందో చూడాలి. సాంగ్స్ లో మాత్రం కాజ‌ల్‌‍తో చిరు చేసే డ్యాన్స్ ర‌చ్చ అదిరిపోయేలా ఉంది. ఇక ర‌త్తాలు ఐటెం సాంగ్‌లో రాయ్‌ల‌క్ష్మీ మాస్ అభిమానులకు మంచి విందుభోజ‌నం. ఇక చరణ్ లెట్స్ డు కుమ్ముడు పాటలో అదిరిపోయే స్టెప్పుల‌తో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్ గా అంజ‌లా ఝ‌వేరి భ‌ర్త త‌రుణ్ అరోరా విలన్ గా అదరగొట్టాడట. ఇక చిరు పక్కన ఉండే పాత్రలో క‌మెడియ‌న్‌గా ఆలీ.. అలాగే కామెడీ పండించే పాత్రలో బ్ర‌హ్మానందం అదరగొట్టాడట. 

సాంకేతిక‌తగా :

ఇక ఈ చిత్రంలో దేవిశ్రీప్ర‌సాద్ తన సంగీతంతో మరోసారి వారేవా అనిపించాడు. . ర‌త్తాలు..ర‌త్తాలు, లెట్స్ డు కుమ్ముడు, సుంద‌రి మాస్ బీట్‌లో ఉంటే క‌న్నీటి సాంగ్ సినిమాలో ఎమోష‌న్ స్థాయిని పీక్ స్టేజ్‌లో ప్రేక్ష‌కుల‌కు ట‌చ్ చేసేలా ఉంది. ఇక దేవి ఆర్ ఆర్‌కూడా అదర‌గొట్టేశాడ‌ని టాక్‌. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీకి గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్రాణం పోసిందట. ఇక ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ – వేమారెడ్డి – బుర్రా సాయిమాధ‌వ్ డైలాగ్స్ కామెడీ, యాక్షన్‌, ఎమోష‌న‌ల్‌గా అన్ని యాంగిల్స్‌లో అద‌ర‌గొడుతాయ‌ని టాక్ వ‌చ్చింది. ర‌న్ టైం కాస్త ఎక్కువు అన్న టాక్ వ‌చ్చినా సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌతంరాజు క్రిస్పీగానే సీన్లు ఎడిట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక చరణ్ నిర్మాణ విలువలు అత్యున్న‌త స్థాయిలో ఉన్నాయి.

వినాయ‌క్ దర్శకత్వం :

తెలుగులో మాస్ చిత్రాలను తనదైన స్టైల్లో తెర‌కెక్కించ‌డంలో వివి.వినాయ‌క్‌ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అఖిల్ సినిమా ప్లాప్ అయిన వినాయ‌క్ ఎలాగైన హిట్ కొట్టాలని ఖైదీ నెంబ‌ర్ 150ను తెర‌కెక్కించాడు. తమిళంలో హిట్ అయిన స్టోరీతో వినాయ‌క్ త‌న‌దైన స్టైల్లో టేకింగ్‌లో రాజీప‌డ‌కుండా చాలా బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాన‌ని ఆయ‌న ధీమాతో ఉన్నారు. ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూల్లో సైతం వినాయ‌క్ సినిమా సూప‌ర్ హిట్ అని చెప్పుతున్నారు. గ‌తంలో చిరు – వినాయ‌క్ కాంబోలో వ‌చ్చిన ఠాగూర్ సూపర్ హిట్ అయ్యింది. సో ఈ సారి కూడా  ఖైదీ నెంబ‌ర్ 150 పక్క హిట్ అనే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. 

ఖైదీ నెంబ‌ర్ 150 సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మెగాస్టార్ చిరుతో పాటు ఖైదీ నెంబ‌ర్ 150 చిత్ర యూనిట్‌కు... పండగకు రెడీ అయిన మెగా ఫ్యాన్స్ కి ఆద్యాన్యూస్.కామ్ త‌ర‌పున శుభాకాంక్ష‌లు.


Facebook

Videos