లైవ్‌లో విష్ణుకు గట్టి వార్నింగ్ ఇచ్చిన మోహ‌న్‌బాబు!

mohan babu warning to vishnu manchu

ఏం అనుకుంటున్నాడో అదే.. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి.. మంచు మోహ‌న్‌బాబు. ఎదురుగా ఉన్నది ఎవరైన సరై తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. అయితే తాజాగా మోహన్ బాబు త‌న కుమారుడు మంచు విష్ణుకు లైవ్‌లోనే గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో జోరుగా హల్ చల్ చేస్తోంది.

ప్రస్తుతం మంచు విష్ణు నటించిన “లక్కున్నోడు” ఆడియో వేడుక తాజాగా జరిగింది. అయితే ఈ వేడుకలో మాట్లాడుతున్న టైంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పీచ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. విష్ణు నువ్వు ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రివి….నువ్వు ఇటీవ‌ల ఓ ఆడియో వేడుకలో నేను నా ఆడియో ఫంక్ష‌న్ల‌కే వెళ్ల‌ను…ఇత‌ర హీరోల ఆడియో ఫంక్ష‌న్ల‌కు ఎలా రాను అన‌డం నేను విన్నాను…అది చాలా త‌ప్పు…నువ్వు ఇత‌ర హీరోల ఆడియో ఫంక్ష‌న్ల‌కు వెళ్లాలి…మ‌న‌స్ఫూర్తిగా వాళ్ల‌ను ఆశీర్వ‌దించాలి… అలాగే నీ సినిమాల ఆడియో ఫంక్ష‌న్ల‌కు ఇత‌ర హీరోలు రావాల‌ని చెప్పారు.

ఆడియో ఫంక్ష‌న్ల‌కు నేను వెళ్ల‌ను అంటూ కొంత మంది హీరోల్లా డ‌బ్బాలు వ‌ద్ద‌ని వార్నింగ్ ఇచ్చారు. నిఖిల్ ఎక్క‌డికి పోతావు చిన్న‌దానా ఫంక్ష‌న్‌లో విష్ణు చేసిన కామెంట్ల‌ను ఉద్దేశించి మోహ‌న్‌బాబు ఈ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ట్విట్ట‌ర్‌లో హీరోల అభిమానుల మ‌ధ్య జ‌రిగే వార్ గురించి కూడా ఆయ‌న మాట్లాడారు. చాలా మంది రోజు మొత్తం కష్టపడి.. వచ్చిన డబ్బుతో సినిమాలను ప్రోత్సహిస్తుంటారు. నటులను అభిమానిస్తుంటారు. అలా తమ హీరోలను ప్రేమించండి, గౌరవించడం మంచిదే కానీ ఒకరిపై ఒకరు మాత్రం బురద జల్లుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు.

Related

  1. ప‌వ‌న్‌ ల‌వ‌ర్‌.. ఇప్పుడు చరణ్ కి అత్త‌!
  2. రమ్యకృష్ణ కోరికను తీరుస్తున్న సీనియర్ డైరెక్టర్!
  3. ప్ర‌భాస్ హీరోయిన్ కి బ్లూ ఫిల్మ్ చాన్స్!
  4. పవన్ ఫ్యాన్స్ పై చిరు ఫైర్.. ఎందుకో తెలుసా..?

Facebook

Videos