ఖైదీ నెంబ‌ర్ 150.. ఒక్కో ఎంతో తెలుస్తే షాక్ అవుతారు!

khadi no 150 1 ticket rate is 12 lakhs

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా మరి కొద్ది గంటల్లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు వెయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మొదటి మూడు రోజుల టికెట్స్ అయిపోయాయని టాక్. ఇక మొదటి షో చూడాటానికి మెగా ఫ్యాన్స్ ఎంత అయిన ఖర్చు పెట్టాడానికి వెనుకాడ‌డం లేద‌ని బెంగ‌ళూరులో జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే చెపుతోంది.

బెంగ‌ళూరులోని ఓ థియేట‌ర్లో ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా చూసేందుకు 3 టిక్కెట్ల‌ను రూ.36 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుని అంద‌రికి షాక్ ఇచ్చాడు చిరు అభిమాని. ఈ వేలంలో వచ్చిన డబ్బును చిరంజీవి పేరిట బెంగళూరులోని ఓ అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని థియేటర్ యాజమాన్యం భావిస్తోందట. అంతేగాకుండా.. ఇటు స్పెషల్ షో టికెట్ ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయట. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖైదీకి భారీ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇక మామూలుగా ప్రీమియ‌ర్ షో టిక్కెట్ల రేటు రూ.500 నుంచి రూ.1500 వ‌ర‌కు ప‌లుకుతున్నాయి. ఇక బ్లాక్‌లో అయితే రూ.2500 వ‌ర‌కు ప‌లుకుతున్నాయి. చాలా చోట్ల అర్ధ‌రాత్రి 1 నుంచే ప్రీమియ‌ర్ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహించగా.. రామ్ చరణ్ నిర్మించారు. 

Related

  1. ఖైదీ నెంబ‌ర్ 150 ప్రీ రివ్యూ
  2. ఖైదీ పాటలకు స్టెప్పులు వేసిన బాలయ్య!
  3. ఖైదీ నంబర్ 150 ఎంత మంది హీరోయిన్స్ ఉన్నారంటే..?
  4. ఖైదీ నెంబర్.150 గురించి చెప్పిన సెన్సార్‌ సభ్యులు!

Facebook

Videos