మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!

chiranjeevi about mahesh and ntr

ఏ పరిశ్రమలో అయిన హీరోలకి ఫ్యాన్సే బలం. స్టార్ హీరోలు కూడా అభిమానులను దృష్టిలో ఉంచుకోనే.. కథలను ఎంచుకుంటారు. హీరోల సినిమాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. హీరోల ఫ్యాన్స్ మధ్య మాత్ర ఆ పోటీ మరి తీవ్రంగా ఉంటుంది.

తమ హీరో సినిమా గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే ఒప్పుకోరు.. గొడవకు సైతం దిగుతారు. ఇలా గొడవలు పెట్టుకోవద్దు అని స్టార్ హీరోలు ఎంత చెప్పిన వినిపించుకోరు. సంక్రాంతి కి ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలు ఒక్క రోజు తేడాల్లో విడుదల కానున్నాయి. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య గొడవలు వస్తాయేమోనని మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి అభిమానుల్ని చైతన్య పరుస్తున్నారు.“మేము తోటి హీరోలందరితో స్నేహంగా ఉంటాము.

ఫ్యాన్స్ కూడా అలాగే ప్రేండ్లీగా ఉండాలి. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ప్రారంభోత్సాహానికి నేను వెళ్ళాను.” అంటూ గుర్తు చేసుకున్నారు. “నాగార్జున, వెంకటేష్ లతో నాకు మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ కూడా తోటి హీరోలతో చాలా స్నేహంగా ఉంటాడు. మొన్న క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నాడు. అలాగే ఎన్టీఆర్  చెర్రీ కి బెస్ట్ ఫ్రెండ్. ఇక అఖిల్ అయితే చరణ్ తో సరదాగా మాట్లాడుకునేందుకు మా ఇంటికి వస్తుంటాడు.”  అని వివరించారు. ఈ విషయలను ఫ్యాన్స్ దృష్టిలో ఉంచుకొని ప్రెండ్లీగా ఉండాలని సూచించారు.

Related

  1. వర్మ.. నాగబాబు.. గొడవపై చిరు.. ఏమన్నారంటే..?
  2. పవన్ ఫ్యాన్స్ పై చిరు ఫైర్.. ఎందుకో తెలుసా..?
  3. ఖైదీ నెం.150 గురించి చిరు షాకింగ్ కామెంట్స్!
  4. 'అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు' అంటున్న చిరు!

Facebook

Videos