శాతకర్ణి సినిమాలో అనసూయ పాత్ర ఇదే!

Anasuya Voice over for Gautamiputra Satakarni

ఈ సంక్రాంతి బరిలో బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కూడా విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన శాతకర్ణి భార్య వశిష్టీ దేవిగా శ్రియా శరణ్ నటించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయకు స్థానం ఎలా.. ఇలాంటి చారిత్రక సినిమాలో ఆమె పాత్ర ఏంటి అనే అనుమానాలు కలుగుతున్నాయి..? బాలకృష్ణ 100 సినిమాలో అనసూయకు కూడా భాగం ఉందన్న మాట నూటికి నూరు పాళ్లు నిజం.

కాకపోతే.. ఈ చిత్రంలో ఆమె కనిపించదు. అనసూయ జస్ట్ తన వాయిస్ మాత్రమే ఈ సినిమాలో వినిపిస్తోందట. గౌతమిపుత్ర శాతకర్ణిలో.. ఇండో-గ్రీక్ యోధురాలు పాత్రను డచ్ మోడల్ ఫరా కరిమి నటించింది. ఈ రోల్ కు డబ్బింగ్ చెప్పాల్సిందిగా.. క్రిష్ అడిగాడు.

బాలకృష్ణ వందో చిత్రంలో తాను భాగం అయ్యే చాన్స్ వదులుకోవడం ఏ మాత్రం ఇష్టం లేని అనసూయ వెంటనే.. ఓకే చెప్పేసిందట. సినిమాలో ఈ రోల్ 15 నిమిషాల పాటు ఉన్నా.. సినిమాని టర్న్ చేసే రోల్ అంటోంది అనసూయ. వాస్తవానికి అనసూయకు డబ్బింగ్ చెప్పడం కొత్తేం కాదు.. వేదం సినిమాలో దీక్షాసేథ్ కు కూడా అనసూయే డబ్బింగ్ చెప్పింది. అయితే యాంకరింగ్ కెరీర్ లో బిజీగా ఉండటంతో అటువైపు వెళ్లలేదట.. కానీ ఇప్పుడు శాతకర్ణి రూపంలో.. బాలకృష్ణ చిత్రం కోసం మళ్లీ క్రిష్ నుంచే అభ్యర్ధన వస్తే కాదనలేక పోయానని చెప్పింది ఈ హాట్ యాంకర్.

Related

  1. నవదీప్ ను అనసూయ అలా చూడాలనుకుంటుంది
  2. మరో సారి తన లుక్స్ తో రెచ్చగొడుతున్న అనసూయ!
  3. పవన్ సరసన యాంకర్ అనసూయ!
  4. మొగుడితో కలిసి రచ్చ రచ్చ చేసిన అనసూయ

Facebook

Videos