నాగబాబు, పవన్ ల గురించి నిజాలు చెప్పిన చిరు!

Chiranjeevi Explains Difference Between Pawan kalyan and Nagababu

మెగాస్టార్ చిరంజీవికి తన ఇద్దరు తమ్ముళ్లంటే ఎంత ఇష్టమో అనేక సందర్భాల్లో చెప్పారు. తమ్ముళ్లపై ప్రేమ తనకు ఎప్పుడు ఉంటుందని చిరు అంటుంటారు. అలాగే తమ్ముళ్ల కూడా చిరు అంటే అంతే ప్రేమ. ఐతే నాగబాబుతో ఎప్పుడూ ఏ ఇబ్బందీ లేదు కానీ.. పవన్ తోనే గత కొన్నేళ్లలో చిరుకు తేడా కొట్టేసింది. రాజకీయ కారణాలతోనో.. వేరే విషయాల వల్లనో.. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. పవన్ రూటు మారింది. చిరు ఇంకో దారిలో నడుస్తున్నాడు.

అయితే నాగబాబు మాత్రం ఎప్పుడూ అన్నయ్యతోనే ఉన్నాడు. ఆయన ఏ దారిలో వెళ్తే.. అదే దారిలో నడుస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు తమ్ముళ్లలో మీకు ఎవరంటే బాగా ఇష్టం అని.. ఇద్దరిలో ఎవరితో ఎక్కువ గా కనెక్టవుతారు అని ఆసక్తికర ప్రశ్న చిరుకు ఎదురైంది. ఆ ప్రశ్నకు చిరు ఏం చెప్పారంటే.. నాకు నా ఇద్దరు తమ్ముళ్లంటే చాలా ఇష్టం ఎవరిని విడదిసి మాట్లాడలేను. అయితే నాకు.. నాగబాబుకి కమ్యూనికేషన్ పరంగా ఎక్కువ అనుబంధం ఉందని తెలిపారు.

నేను.. నాగబాబు గంటలు గంటలు మాట్లాడుకుంటాం.. నాగబాబుతో మాట్లాడుతుంటే నాకు అసలు టైం తెలియదు. చాలా విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఇంకా అనేక పుస్తకాల గురించి.. ప్రాపంచిక విషయాల గురించి నాతో చర్చిస్తాడు. నన్ను నవ్విస్తాడు. విజ్నానం పంచుతాడు. అలాగే తాను హోస్ట్ చేసే జబర్దస్త్ కార్యక్రమంలో రకరకాల సంగతుల గురించి నాతో చర్చిస్తాడు. పవన్ కళ్యాణ్ తో నాకు ఈ రకమైన కమ్యూనికేషన్ తక్కువ. కళ్యాణ్ ముందు నుంచి కూడా నాతో కూర్చుని మాట్లాడ్డం అరుదు. కానీ అతడితో నా అనుబంధానికి ఢోకా ఏమీ లేదు’’ అని చిరు చెప్పాడు.

Related

  1. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!
  2. పవన్ ఫ్యాన్స్ పై చిరు ఫైర్.. ఎందుకో తెలుసా..?
  3. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!
  4. వర్మ.. నాగబాబు.. గొడవపై చిరు.. ఏమన్నారంటే..?

Facebook

Videos