అప్పుడే.. 'బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!

khaidi breaks bahubali records with premier shows

తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగా స్టార్ చిరంజీవి.. ఖైది నంబర్ 150 రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తో ఇప్పుడు దుమ్ము లేపుతున్నాడు. అమెరికాలో దాదాపు ఈ సినిమాని 200పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ప్రీమియర్ షోల ద్వారా లక్ష మిలియన్ డాలర్లకు పైగానే (6కోట్ల 82లక్షల 45వేల రూపాయలకు పైగా) వసూకు చేసింది. ఇప్పటివరకూ ప్రీమియర్ షోల ద్వారా లక్ష మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన టాలీవుడ్ సినిమా ఒక్క బాహుబలి మాత్రమే.

అమెరికాలో రికార్డు స్థాయిలో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసినా.. వేలాది మంది ప్రేక్షకులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారనీ, ప్రీమియర్ షోలకు టికెట్ బుకింగ్ అయిపోయిందనీ అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ట్వీట్ చేశారు. మరికొన్ని థియేటర్లను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి ప్రీమియర్ షోలకు టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ అయ్యిందని అయితే గంటల్లోనే హాటు కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోయాయని తెలిపారు.

అమెరికాలో రికార్డులన్నీ ఖైదీ నెంబర్ 150 చిత్రం తిరగరాయడం పక్కా అని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా బుధవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రంకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. చిరు ఈ చిత్రంలో ఇరగదీశారని చెబుతున్నారు. ముఖ్యంగా డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ విషయంలో అద్భుతంగా చేశారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

Related

  1. ఖైదీ నంబర్ 150 చిత్రం రివ్యూ 
  2. ఖైదీ నంబ‌ర్ 150 లో అతి పెద్ద మైనస్ ఇదే!
  3. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!
  4. పవన్ ఫ్యాన్స్ పై చిరు ఫైర్.. ఎందుకో తెలుసా..?

Facebook

Videos