ఖైదీ ని అభిమానులతో చూసిన మెగా ఫ్యామిలీ!

do you know what caused mega family for khadi no 150

ఈ రోజు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నంబర్ 150 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రంను చాలా మంది మొదటి షో చూస్తే.. ఇక మెగా ఫ్యామిలీ సైతం ఈ చిత్రంను చూసేందుకు కదలి వచ్చింది.

మాములుగా ఖైదీ చిత్రం చూస్తే అందులో మాజా ఏముంటుంది అనుకున్నారో ఏమోకాని.. మెగా అభిమానుల మధ్య ఈ సినిమా చూడటానికి మెగా ఫ్యామిలీ మొత్తం  బుధ‌వారం ఉద‌యం హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటరులో సినిమాను వీక్షించారు. ఖైదీ చిత్రంని అభిమానుల మధ్య చూసేందుకు చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖ వచ్చారు. వీరితో పాటు.. హీరో అల్లు అర్జున్ తన సతీమణితో కలసి వచ్చారు. వద్ద వీరిని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు.

“బాస్ ఈజ్ బ్యాక్”, “స్టైలిష్ స్టార్” అంటూ నినాదాలు చేశారు. వీరిని థియేటర్ లోకి పంపేందుకు పోలీసులు, బౌన్సర్లు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అంతకు ముందు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో థియేటర్‌లో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ఇక ఖైదీ సినిమాను తొలి రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లువురు సెల‌బ్రిటీలు చూసి సూప‌ర్ అంటూ చిరును ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చిరు సరసన కాజల్ నటించిన ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహించగా.. రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించారు.

Related

  1. ఖైదీ నంబర్ 150 చిత్రం రివ్యూ 
  2. నాగబాబు, పవన్ ల గురించి నిజాలు చెప్పిన చిరు!
  3. పవన్ ఫ్యాన్స్ పై చిరు ఫైర్.. ఎందుకో తెలుసా..?
  4. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!

Facebook

Videos