ఖైదీ సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!

Rajamouli Review on Khaidi No 150 Movie

టాలీవుడ్ లో ఏదైనా పెద్ద చిత్రం వస్తే చాలు.. ఆ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడెప్పుడు రివ్యూలు పెడతాడని అందరూ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే.. రాజమౌళి ప్రతి పెద్ద చిత్రంను దాదాపు మొదటి రోజే ప్రసాద్ ఐమ్యాక్స్ లో 8.45 ఆటకు చూసేసి.. వెంటనే దానికి ట్విట్టర్లో రివ్యూ ఇస్తుంటాడు.

మరి అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ''ఖైదీ నెం 150'' గురించి జక్కన్న ఏమన్నారంటే.. " చిరంజీవిగారిని 10 ఏళ్ళు చాలా మిస్సయిపోయాం.. తిగిగి వెనక్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్.. బాస్ ఈజ్ బ్యాక్.. ఇలాంటి రికార్డు బ్రేకింగ్ సినిమాని నిర్మించినందుకు చరణ్ కి కంగ్రాచ్యులేషన్స్. అలాగే వినాయక్ గారు కుమ్మేశారంతే. మీకంటే గొప్పగా ఎవరు ఈ సినిమాని హ్యాండిల్ చేయలేరు. ఖైదీ టీమ్.. హ్యావ్ ఏ బ్లాస్ట్'' అంటూ తన మినీ రివ్యూ అందించాడు రాజమౌళి.

ఖైదీ నెం 150 ప్యూర్ గా చిరంజీవి పునరాగమనం కోసం క్రియేట్ చేసిన ఒక ప్రాజెక్టు కాబట్టి.. రాజమౌళి కూడా అదే రేంజులో ఎక్సయిట్ అయినట్లున్నాడు. ఇక ఈ సినిమాని చూసిన ఇతర సెలబ్రిటీలు కూడా చాలా ఎక్సయిట్ అవుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాను తెలుపుతున్నారు. ప్రస్తుతం సొషల్ మీడియాలో #BossIsBackfestival అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

Related

  1. ఖైదీ నంబర్ 150 చిత్రం రివ్యూ 
  2. ఖైదీ నంబ‌ర్ 150 లో అతి పెద్ద మైనస్ ఇదే!
  3. పవన్ ఫ్యాన్స్ పై చిరు ఫైర్.. ఎందుకో తెలుసా..?
  4. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!

Facebook

Videos