శాతకర్ణి సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!

rajamouli tweets gps

నందమూరి అందగాడు.. బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా  ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 100వ చిత్రం. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులే కాదు ఇటు సగటు ప్రేక్షకుల్లోనూ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ హీరోయిన్ గా నటించగా నటించింది. సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రత్యేక షోను కొద్దీ సేపటి క్రితం హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్ ప్రదర్శించారు. ఈ షోకు హీరో బాలకృష్ణ తో పాటు డైరెక్టర్ క్రిష్, దర్శకధీరుడు రాజమౌళి వీక్షించడం జరిగింది. ఈ క్రమంలో సినిమా బాగుంది అని బాలకృష్ణ చెప్పగా.. రాజమౌళి తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.

” సాహో బసవతారకర్మ పుత్ర బాలకృష్ణ !!!..ఐ సెల్యూట్ యు సార్ ఫర్ యువర్ పోట్రయల్ అఫ్ శాతకర్ణి థాట్ విల్ మేక్ నందమూరి తారకరామారావు గారు ” అంటూ తెలియజేసాడు.. బుర్రా సాయిమాధవ్‌ రాసిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా చెప్తున్నారు. శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడని.. యుద్ధ సన్నివేశాలు చాలా రిచ్‌గా తెరకెక్కించారని అంటున్నారు. చిత్రంలోని భావోద్వేగాలు ఆయా సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చాయి. ఇక విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. దర్శకుడు క్రిష్‌ టేకింగ్‌, కథనం నడిపిన తీరు చాలా బాగుందంటున్నారు.

Related

  1. ఖైదీ సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!
  2. ప్రభాస్ ను ఇంటికి పంపించిన రాజమౌళి!
  3. రాజమౌళి తండ్రి కాళ్లు పట్టుకున్న సుకుమార్‌.. ఎందుకు..?
  4. సుబ్బరాజు ఎందుకు పెళ్లి చేసుకోట్లేదంటే?

Facebook

Videos