అక్కినేని ఫ్యామిలీలో విషాదం.. హీరో తండ్రి మృతి..

akkineni nageshwara rao sun in law anumolu satya bhushana rao death

అక్కినేని వారి ఇంట విషాదం నెలకొంది. అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగ సుశీల భర్త అనుమోలు సత్యభూషన రావు తుది శ్వాస విడిచారు. గత రెండు సంవత్సరాలుగా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం మరణించాడు. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో వైధ్యులు కూడా ఏం చేయలేకపోయారు.

సత్యభూషణ రావు తనయుడు సుశాంత్ హీరోగా చాలా కాలం క్రితం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కొడుకు హీరోగా రాణిస్తే చూడాలని సత్యభూషణ రావు కోరుకున్నారు. కానీ అది తీరకుండానే ఆయన చనిపోవడం బాధకరం. ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ సంస్థలో ఎన్నో చిత్రాలు నిర్మించి అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు తెచ్చుకున్న అనుమోలు వెంకట సుబ్బారావు తనయుడు సత్యభూషణ రావు. నిర్మాతగా మొదట్లో రెండు మూడు సినిమాలు ప్రయత్నించినా కూడా అవి సక్సెస్ కాలేదు.

ఇటీవల వీరి ఆస్తులను వేలం వేయబోతున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. సత్యభూషణ రావు చనిపోవడంతో అక్కినేని కుటుంబ శోఖ సంద్రంలో మునిగి పోయింది. బావ మృతి పట్ల నాగార్జున తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు. సినీ ప్రముఖులు సత్యభూషణ రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related

  1. షాకింగ్ : అఖిల్, శ్రియాల పెళ్లి క్యాన్సిల్ కాలేదు.. నిజాలు బయట పెట్టిన నాగ్
  2. తరుణ్‌ కు మొహాంపైనే కుదరదని చెప్పిన నాగ్..
  3. చైతూ.. సమంత పెళ్లికి బ్రేక్.. నాగ్ కి టెన్షన్ స్టార్ట్..
  4. చిరు.. వెంకీ.. బాలయ్య తో నాగ్ మల్టీ స్టారర్

Facebook

Videos