‘బాహుబలి’కి కొట్టేందుకు.. మరో భారీ సినిమా...

Another Visual Wonder Sangamitra

‘బాహుబలి’ని కొట్టే సినిమా చేయాలని చూస్తోంది కోలీవుడ్. సీనియర్ డైరెక్టర్  సుందర్.సి ఈ ప్రయత్నంలోనే ‘సంఘమిత్ర’ అనే సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సుందర్ చాలా కాలంగా ఈ ప్రాజెక్టు మీద పని చేస్తుండగా.. రెగ్యులర్‌ షూటింగ్‌కు రంగం సిద్ధం చేశాడు. ప్రస్తుతం కేన్స్‌లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్‌లోనే ఈ చిత్రాన్ని లాంచ్ చేయడం విశేషం.

ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్న జయం రవి, ఆర్య, శ్రుతి హాసన్‌లతో పాటు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్.. నిర్మాతలతో కలిసి సుందర్ కేన్స్‌కు చేరుకున్నాడు. సంఘమిత్ర’ టీం అక్కడ సందడి చేయడానికి ముందు.. ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ ఆర్ట్ పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ ‘తెండ్రాల్ ఫిలిమ్స్’. అది చూస్తే.. ‘సంఘమిత్ర’ బాహుబలి బాటలోనే సాగుతుందని.. రాజమౌళి సినిమాకు దీటుగానే ఉంటుందని అర్థమవుతోంది.

భారీ ఓడలు ఒకదాని వెంట ఒకటి సముద్రంలో భయానక వాతావరణం మధ్య ప్రయాణిస్తుంటే.. అందులో ఒక ఓడపై ఓ యోధుడు నిలబడి ఉన్నాడు. బహుశా ఆ యోధుడు జయం రవినే కావొచ్చేమో. ఈ ఫోటో చూస్తుంటే.. ఈ సినిమా భారీగా నిర్మించనున్నారని తెలుస్తోంది.  ‘బాహుబలి’ లాగా విజువల్ వండర్ అయ్యేందుకు ఆస్కారాలు లేకపోలేదని అనిపిస్తోంది. ఈ చిత్రానికి బడ్జెట్ ఎంత అని చెప్పలేదు కానీ.. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో దీనికి ఖర్చు పెడుతున్నట్లుగా చెప్పాడు సుందర్. 

Related

  1. పవన్ కళ్యాణ్ ఒక బాహుబలి.. రాజమౌళి దర్శకత్వం పక్కా..?
  2. కేఏ పాల్ తో కలిసి బాహుబలి 2 ను చూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  3. బాహుబలి 2 చూసి.. తెగ ఏడ్చేసిన రమ్యకృష్ణ..
  4. బాహుబలికి ఈ పాపకు మధ్య సంబంధం ఏంటో తెలుసా..?

Facebook

Videos