మోహన్‌బాబుతో రొమాన్స్‌ చేసిన ఆమె.. మళ్లీ తల్లిగా.. ఇప్పుడు బామ్మగా.. ఇంతకి ఎవరు ఆమె..?

mohan babu first heroine is annapurna

టాలీవుడ్ టాప్ హీరోలతో అప్పుడు నటించిన హీరోయిన్స్.. ఇప్పుడు తల్లి పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. కొందరు అయితే బామ్మ పాత్రల్లో కూడా నటిస్తూ ఉన్నారు. మోహన్ బాబు ఫస్ట్ మూవీకి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం దాసరి కొత్త వారిని ఎంపిక చేయడం జరిగింది.

హీరో హీరోయిన్స్ తో పాటు పలు పాత్రలకు అంతా కొత్తవారినే ఎంపిక చేసారు. హీరోగా భక్తవత్సలం నాయుడును ఎంపిక చేసిన దాసరి హీరోయిన్ గా ఉమ అనే అమ్మాయిని అప్పుడు ఎంపిక చేశాడు. అయితే భక్తవత్సలం నాయుడు పేరును కాస్త మోహన్ బాబుగా మార్చిన దాసరి.. ఉమ పేరును అన్నపూర్ణగా మార్చేశాడు. మోహన్ బాబు ఫస్ట్ మువీ స్వర్గం నరకం. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఉమ అలియాస్ అన్నపూర్ణ ఇప్పుడు సినిమాల్లో బామ్మ పాత్రల్లో నటిస్తూ ఉంది.

ఆ మధ్య స్టార్ హీరోలకు తల్లిగా చేసింది. అంతెందుకు స్వర్గం నరకం లో మోహన్ బాబుకు ప్రేయసిగా నటించిన అన్నపూర్ణ ఆ తర్వాత అసెంబ్లీ రౌడీ సినిమాలో మోహన్ బాబుకు తల్లిగా నటించింది. హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో అన్నపూర్ణ తల్లి పాత్రలకు తల వంచాల్సి వచ్చిందట. ప్రస్తుతం అన్నపూర్ణమ్మకు పెద్దగా ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

Related

  1. కుర్ర హీరో విజయ్‍తో సమంతతో రొమాన్స్
  2. కట్టప్పతో శివగామి రొమాన్స్.. నెట్ లో వీడియో హల్ చల్
  3. ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్న నందిత
  4. రష్మీతో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్

Facebook

Videos