జై లవ కుశ ఫస్ట్ లుక్ అదిరింది..

jai lava kusa first look relesed

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మంచి జోష్ మీదున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో  మరో సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'జై లవ కుశ' అనే టైటిల్ ఖరారు చేసారు.  శ్రీరామ నవమి సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు.  మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఎన్టీఆర్ ఇందులో పవర్ ఫుల్ లుక్స్ తో గత సినిమాలకు భిన్నంగా ఆకర్షనీయంగా ఉండటం గమనార్హం. ఇఅ ఈ సినిమా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ విషయాన్నికి వస్తే.. ఎన్టీఆర్ చేతికి సంకెళ్లు వేసుకుని కనిపిస్తుండటంతో సినిమాలో ఎలాంటి పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు? అనేది విషయమై ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూడు పాత్రల్లో ఒకటి నెగెటివ్ రోల్ ఉంటుందని టాక్. ఇక ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా కనిపించనున్నారు. 

Related

  1. జ‌గ‌న్‌కి మద్దతుగా ఎన్టీఆర్ కూతురు.. అమె దెబ్బకి టీడీపీ విలవిల కొట్టుకుంది..
  2. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ తో ఎన్టీఆర్ కి ఏం సంబంధం..?
  3. రాజమౌళి నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్ తోనే
  4. కొత్త పార్టీ పై సంచలన కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

Facebook

Videos