హీరోయిన్ తో ఎఫైర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన అల్లరి నరేష్!

allari naresh discloses his affair with heroine

సినిమా పరిశ్రమలో రూమర్స్‌కి కొదువే లేదు. ఓ హీరో, హీరోయిన్ ఒకటి రెండు చిత్రాల్లో కలిసి నటించారంటే.. ఇక వీరిద్దరికి ముడిపెట్టేయండం.. పుకార్లు రావడం జరుగుతోంది. అయితే టాలీవుడ్‌లో సుమారు 50 సినిమాల్లో నటించిన ‘అల్లరి నరేష్’ ఈ రూమర్స్‌కి కాస్త దూరంగానే ఉన్నాడు. అయితే తన పై కూడా పుకార్లు వచ్చాయి అని తాను చాలా భయపడ్డాను అని చెప్పాడు.

తనకు పెళ్ళి కాకముందు ఒక హీరోయిన్‌తో తనను లిక్ చేస్తూ ప్రచారంలోకి వచ్చిన రూమర్స్ తనను ఎంత టార్చర్ పెట్టిందని, అయితే ఇదే విషయాన్ని ఆ హీరోయిన్‌తో చర్చిస్తే లైట్ బాస్ అని ట్విస్ట్ ఇచ్చిందని ఇప్పుడు బయట పెట్టాడు ఈ అల్లరోడు. ఇటీవల ఓ టివి ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ టాలీవుడ్ గాసిప్స్ గురించి మాట్లాడుతూ... ఒక టైంలో నాకు ఓ హీరోయిన్‌తో ముడిపెట్టి కథలు అల్లేశారు. నేను ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతున్నట్టు, వార్తలు రాసేశారు. కానీ ఆ హీరోయిన్ గురించి అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఆ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్‌ను వెంట తీసుకొచ్చేది. ఆమె దగ్గరికి వెళ్లి మా ఇద్దరి మధ్య ఎఫైర్ గురించి వస్తున్న రూమర్ల గురించి చెప్పాను. తను నవ్వింది. నాతో ఎఫైర్ అని రూమర్లు పుట్టిస్తే తనకెలాంటి ఇబ్బందీ లేదని.. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్‌కు కూడా నేనంటే ఏంటో తెలుసు కాబట్టి ఈ రూమర్ల విషయంలో తనకెలాంటి అభ్యంతరం లేదంటూ నవ్వేసింది. కానీ అప్పటికే నాకు ఇంట్లో సంబంధాలు చూస్తుండటంతో నాకు ఇది తలనొప్పిగా మారింది. నా కెరీర్లో ఎఫైర్ అంటూ రూమర్లు ఎదుర్కొన్నది ఆ ఒక్క హీరోయిన్‌తోనే'' అని అల్లరి నరేష్ తెలిపాడు. ఐతే ఆ కథానాయిక ఎవరు అంటే అది మాత్రం చాలా సీక్రెట్.. నాతో నటించిన హీరోయిన్స్‌లో ఒకరు అని తెలివిగా తప్పించుకున్నాడు అల్లరోడు.

Related

  1. స్టార్ హీరోయిన్‌ శృంగారం చేస్తూ దొరికన యంగ్ హీరో!
  2. హీరోయిన్ అనిత డబ్బు ఎలా సంపాదిస్తోందో తెలుసా?
  3. మోజు పడి.. స్టార్ హీరోతో జంప్‌ అయిన హీరోయిన్!
  4. టాప్ హీరోల కోరికలు తీర్చిన స్టార్ హీరోయిన్

Facebook

Videos