పవన్ సరసన యాంకర్ అనసూయ!

Anasuya Crazy offer

జబర్ధస్త్ షోతో బాగా క్రేజ్ సంపాదించుకొని.. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో తొలిసారి వెండితెరపై తళుక్కున మెరిసింది యాంకర్ అనసూయ. ఆ తర్వాత క్షణం సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకుంది.

తాజా సాయి ధరమ్ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న విన్నర్ సినిమాలో ఐటమ్ భామగా కనిపించనుంది. ఈ సినిమా కోసం అనసూయ ఏకంగా 12 కేజీలు బరువు పెరిగిందంట. ఇప్పుడు ఈ హాట్ భామ పవన్ సినిమాకు సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తాజా చిత్రం కాటమరాయుడు. ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్ ఛాన్స్ అనసూయ సొంతం చేసుకుందట.

సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ సరసన లక్ష్మీ రాయ్ ఐటెంగర్ల్ గా కనిపించి అలరించగా ఇప్పుడు కాటమరాయుడు సినిమాలో అనసూయ పవర్ స్టార్ తో కలిసి చిందేయబోతోందట. ఇప్పటికే ఈ పాట కోసం అదిరిపోయే ట్యూన్ కూడా రెడీ చేశాడు అనూప్. ఇక ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related

  1. మొగుడితో కలిసి రచ్చ రచ్చ చేసిన అనసూయ
  2. అనసూయ బెడ్ రూమ్ వీడియో హల్ చల్!
  3. అభిమానికి క్లాస్ పీకిన అనసూయ! ఎందుకంటే?
  4. ఆ హీరోని పొగడ్తలతో ముంచెత్తిన అనసూయ!

Facebook

Videos