రమ్యకృష్ణ కోరికను తీరుస్తున్న సీనియర్ డైరెక్టర్!

ramya krishna as jayalalithaa biopic

సీనియర్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు కొన్నాళ్లుగా దర్శకత్వంకు దూరంగా ఉంటున్నారు. అయితే దాసరి మళ్లీ ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారట. గత నెలలో మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను సినినిమాగా తీసేందుకు దాసరి నారాయణ రావు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'అమ్మ' టైటిల్‌ను కూడా దాసరి రిజిస్టర్‌ చేయించాడు. ప్రస్తుతం జయలలిత జీవిత చరిత్రను సంబంధించి స్క్రిప్టును రెడీ చేస్తున్నారట.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించే ఈ సినిమాని వేసవిలో మొదలు పెట్టబోతున్నారు. అయితే అమ్మ పాత్రను ఏవరు పోషిస్తారో అనేది అందరిలో ఆసక్తిగా మారింది. అయితే అందుతున్న సమాచరం ప్రకారం అమ్మ పాత్రలో రమ్యకృష్ణ నటించబోతున్నారట. అయితే రమ్యకృష్ణ జయలలిత పాత్ర పోషించాలని ఉందని అది తన డ్రీమ్‌ రోల్‌ అని రమ్య తన సన్నిహితులతో అంటుందట. అమ్మ పాత్ర పోషించే చాన్స్ వస్తే వదులుకోనని ఇదివరుకే రమ్య చెప్పిన విషయం తెలిసిందే.

ఇటివలే దాసరి కూడా జయలలిత జీవిత చరిత్రలో అమ్మ పాత్రకు రమ్య కరెక్ట్ గా ఉంటుందని ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందుకు రమ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాకుండా జయలలిత పాత్ర చేయడం తన కోరిక అని దాసరితో తెలిపిందంట. ఇక జయలలిత పాత్రను రమ్య కృష్ణ చేస్తే బాగుంటుందని పోస్ట‌ర్లు డిజైన్ చేసి సోషల్ మీడియాలో అభిమనులు పోస్ట్ చేశారు. మొత్తానికి అమ్మ పాత్ర పోషించాలన్న తన కోరిక నెరవరుతున్నందుకు రమ్యకృష్ణ అనందంగా ఉంది.

Related

  1. పదహారేళ్ల వయసులోనే టాలీవుడ్ లోకి వచ్చిన హీరోయిన్స్ వీరే!
  2. శ్రీదివ్య హాట్ వీడియో లీక్!
  3. వేణుమాధవ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే!
  4. ముగ్గురితో సెక్స్ చేస్తూ దొరికిన తెలుగు యాంక‌ర్‌

Facebook

Videos