బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!

bunny controversy

వరస హీట్స్‌తో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ ప్రస్తుతం హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో దువ్వాడ జ‌గ‌న్నాథం అనే చిత్రంలో నటిస్తున్నాడు. కేరీర్ ప‌రంగా మంచి స్టేజ్ లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్‌లో వ‌రుస‌గా కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌గా నిలవనున్నాడు. అల్లు అర్జున్ చేస్తున్న వరస కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

స‌రైనోడు చిత్ర సక్సెస్ మీట్ లో పవన్ అభిమానులు ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మ‌ని అడగగా.. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని బ‌న్నీ కామెంట్లు చేయడం పెద్ద వివాదం అయ్యింది. ఈ కామెంట్ల తర్వాత మ‌న‌సు ఆడియో వేడుక‌లో అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చుకున్నాడు. అయినా బ‌న్నీని ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ద‌ల‌డం లేదు. ఆ వివాదం స‌ద్దుమ‌ణుగుతుంది అనుకున్న సమయంలో ఇప్పుడు మరో సారి అలు అర్జున్ మ‌రో కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేశాడు. ఇటీవ‌ల విశాఖ వెళ్లిన బ‌న్నీ సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుతూ ఈ సారి సంక్రాంతి సినిమా మ‌న‌దే అని చెప్పాడు.

ఈ సారి సంక్రాంతి మ‌న‌దే రాసుకోండంటూ అన్నాడు. అంటే బాల‌య్య శాత‌క‌ర్ణి కంటే చిరు ఖైదీ సినిమానే హిట్ అవుతుంద‌న్న అర్థంలో వ‌చ్చేలా మాట్లాడాడు. ఇక కాట‌మ‌రాయుడు చిత్రం గురించి ఇన్‌డైరెక్టుగా మాట్లాడాడు. 2016లో మిగిలిన లెక్క‌లేమైనా ఉంటే.. 2017లో స‌రిచేస్తామంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ పై ఇండ‌స్ట్రీ జ‌నాలు అల్లు అర్జున్ గొప్ప‌ల‌కు పోతూ లేనిపోని కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకుంటున్నాడ‌నే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పై బాలకృష్ణ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మ‌రి ఫ్యూచ‌ర్‌లో అయినా అల్లు అర్జున్ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ల‌కు దూరంగా ఉంటే మంచిదని పలువురు చెబుతున్నారు.

Related

  1. బాలయ్యపై బన్నీ షాకింగ్ కామెంట్స్.. ఫైర్ అయిన అభిమానులు!
  2. బన్నీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్మీ
  3. పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ పట్టించుకోలేదా? కారణం ఇదేనా?
  4. చిన్నారి ప్రాణాలు కాపాడిన హీరో అల్లు అర్జున్!

Facebook

Videos