ప‌వ‌న్‌ ల‌వ‌ర్‌.. ఇప్పుడు చరణ్ కి అత్త‌!

pawans heroine act cherry aunt role

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు. ఇటివలే.. ధృవ సినిమా మంచి హిట్ కావడంతో  ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే మ‌రోవైపు తాను నిర్మాత‌గా త‌న తండ్రి నిర్మిస్తోన్న ఖైదీ నెంబ‌ర్ 150 ప్ర‌మోష‌న్స్‌లో చాలా బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఖైదీ విడుదల అయ్యాక చరణ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో న‌టిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో చరణ్ బాబాయి పవన్ కళ్యాణ్ సరసన ఓ చిత్రంలో పవన్‍కు లవర్ గా నటించిన హీరోయిన్ చరణ్ కి అత్తగా నటిస్తోందని తెలుస్తోంది. టాలీవుడ్ లో నిన్నటి తరం మాజీ హాట్ హీరోయిన్ రాశి... చరణ్, సుకుమార్ సినిమాలో చరణ్ అత్త క్యారెక్ట‌ర్‌లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా తెరకెక్కే చిత్రం షూటింగ్ ఈ నెల చివర నుంచి ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ రెండో సినిమాగా తెరకెక్కిన గోకులంలో సీత సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశి.. ఆ తర్వాత టాప్ రేంజ్ లో ఉన్నపుడే వివాహం చేసుకొని సెటిల్ అయిపోయింది. పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాశి ఇప్పుడు చరణ్ చిత్రంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించేందుకు ఓకే చెప్పిందట‌. ఈ చిత్రంలో రాశి చరణ్ కి అత్తగా నటించనుందని సమాచారం. రాశి ఈ చిత్రంలో నటించడం క‌న్‌ఫార్మ్ అయినా ఆమె క్యారెక్ట‌ర్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Related

  1. బాల‌య్య‌పై.. షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్!
  2. రామ్ చరణ్ ని అవమానించిన మెగా ప్రొడ్యుస‌ర్!
  3. చరణ్ ని ఘోరంగా అవమానించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్!
  4. చరణ్ కి అఖిల్ కి మధ్య ఉన్న సంబంధం ఇదే!

Facebook

Videos