పవన్ ఫ్యాన్స్ పై చిరు ఫైర్.. ఎందుకో తెలుసా..?

chiranjeevi fires on pawan kalyan fans

మెగా కుటుంబంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్  మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయని.. అందుకే వీరిద్దరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదని ఆ మధ్య అందరూ అనుకున్నారు. కానీ పవన్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఆడియో పంక్షన్ లో మాత్రం మెగా బ్రదర్స్ ఒక్కటే అని... ఆ పంక్షన్ లో నిరూపించారు. దీంతో వదంతులకు కాస్త విరామం దొరికింది.

కానీ చిరు నటించిన 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ హాజరు కాలేదు. దానికంటే... ముందు మాత్రం ట్విట్టర్ లో స్పందిస్తూ.. చరణ్, మా వదిన కలసి నిర్మిస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమా బాగా ఆడాలని, చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు పవన్. ఇంతవరకు బాగానే ఉన్నా..ప్రీ రిలీజ్ ఫంక్షన్ చివరిలో స్టేజ్ ముందుకు వచ్చిన ఒక పవన్ అభిమాని, జనసేన పార్టీ జెండాను తెగ ఊపేస్తూ చిరు కంట్లో పడ్డాడు.

అది చూసిన చిరుకు కోపం కట్టలు తెంచుకొని వచ్చిందట. పలుమార్లు ఆ జెండాను ఉద్దేశించి సైగలు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో, ఇన్ డైరెక్ట్ గా కొన్ని మాటలు అన్నట్టు తెలిసింది. అసలు తమ్ముడు పవన్ మీద ఎలాంటి కోపం లేకపోతే అంత కోపం ఎందుకొచ్చిందని, పక్క హీరో పార్టీ జెండా ఊపలేదు కదా, మెగా కుటుంబంకు సంబంధించినదే కదా అని పవర్ స్టార్ అభిమానులు అంతా మెగాస్టార్ ను ప్రశ్నిస్తున్నారు. ఇలా జరుగుతుంటే..పవన్ తో గొడవలు లేవంటే నమండం ఎలా అనే అనుమానం కూడా పవన్ అభిమానులకు వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ లొల్లి ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.

Related

  1. బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!
  2. పవన్ చేయబోయే చివరి సినిమా అదేనా..?
  3. ఖైదీ నంబర్ 150 మూవీ మొదటి రివ్యూ!
  4. ఖైదీ, శాతకర్ణి సినిమాల ప్లసులు, మైనస్‌లు!

Facebook

Videos