మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!

alluarjun roundup to pavan fans

మెగాస్టార్ చిరు నటించిన ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ వేడుక హయల్యాండ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఘనంగా జరిగిన.. అంతకు మించిన వివాదాలను కారణమైంది. మెగా బ్రదర్ నాగబాబు.. యండమూరి, రాంగోపాల్ వర్మపై చేసిన కామెంట్స్ పెద్ద వివాదంగా మారాయి.

ఈ వేడుకలో చిరంజీవి ఓ పవన్ అభిమాని వల్ల ఇబ్బందిపడిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ వేడుకకు వచ్చిన అల్లు అర్జున్ ను పవన్ ఫ్యాన్స్ వదల్లేదు. ఖైదీ నెం.150 సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ వచ్చాడు. కారులో దిగి వేదిక దగ్గరకు వెళుతుండగా పవన్ ఫ్యాన్స్ బన్నీని చుట్టుముట్టారు. పవర్ స్టార్.. పవర్ స్టార్.. అంటూ నినాదాలు చేశారు. బన్నీ ఎటూ కదిలే పరిస్థితి లేకపోవడంతో అలానే చూస్తూ చిరునవ్వులు చిందించాడు.

కొద్దిసేపటికి పోలీసుల జోక్యంతో అల్లుఅర్జున్ పక్కకు వెళ్లిపోయాడు. పవన్ అభిమానులు ఎంత చెప్పినా బన్నీ.. పవన్ పేరు చెప్పకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. గతంలో పవన్ గురించి బన్నీ చెప్పను బ్రదర్ అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ పై ఒక మనసు ఆడియో విడుదలలో బన్నీ నిప్పులు చెరిగాడు. సరైనోడు ఫంక్షన్‍లో పవన్ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో విసిగిపోయి తానలా మాట్లాడినట్లు ఆ తర్వాత అల్లుఅర్జున్ వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. ఏదేమైనా ఫ్యాన్స్ చూపిస్తున్న అత్యుత్సాహం వల్ల పవన్‍కు, మెగా ఫ్యామిలీకి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని సినీ ప్రేక్షకులు అంటున్నారు.

Related

  1. అల్లు అర్జున్ కి తలనొప్పిగా మారిన ప్రభాస్!
  2. పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ పట్టించుకోలేదా? కారణం ఇదేనా?
  3. చిన్నారి ప్రాణాలు కాపాడిన హీరో అల్లు అర్జున్!
  4. ఎన్టీఆర్ కి భయపడ్డ అల్లు అర్జున్!

Facebook

Videos