ఖైదీ పాటలకు స్టెప్పులు వేసిన బాలయ్య!

balakrishna about khaidi no 150 songs

సినిమా పరిశ్రమలో అగ్ర‌స్థానంలో ర‌న్ అవుతున్న మెగా ఫ్యామిలీ.. నంద‌మూరి ఫ్యామిలీలు సినిమా విషయంలో పోటీ పడుతునే ఉన్నారు. అయితే వారు మధ్య ఎలాంటి విబేధాలు లేవని కొట్టిపడేస్టూ ఓ ఆసక్తికరమైన న్యూస్ లీక్ చేశారు నందమూరి బాలకృష్ణ.

2017 సంక్రాంతి సంబ‌రాలు అదిరిపోయే రెంజ్ లో జరపడానికి రెడీ అవుతుంది టాలీవుడ్. మరో మూడు రోజుల్లో ఇటు.. మెగా ఫ్యాన్స్, అటు.. నంద‌మూరి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి వెండితెర‌పై పోటీప‌డ‌నున్నారు. అయితే ఈ పోటీని కేవ‌లం కొంత మంది ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుని త‌మ మ‌ధ్య వివాదాల‌కు తెర‌లేపుతున్నారే కానీ, త‌మ మ‌ధ్య ఎటువంటి వివాదాలు లేవ‌ని అటు బాల‌య్య‌, ఇటు చిరంజీవి చాలాసార్లు తెలిపారు.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్ర ప్రారంబోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం సాదించాల‌ని మెగాస్టార్ చిరంజీవి కోరిన సంగ‌తి తెలిసిందే.  అయితే రీసెంట్ గా ఖైదీ చిత్రం పాటలపై ప్రత్యేక న్యూస్ రిలీజ్ చేశారు బాలయ్య. ఈ మ‌ధ్య బాల‌య్య ఎక్కువ‌గా ఖైదీ సాంగ్స్ వింటూన్నారట. అందులోనూ ముఖ్యంగా నీరు.. నీరు అనే పాట బాలయ్య మనసును బాగా నచ్చిందట. మాస్ బీట్ సాంగ్‌లు విన్న‌ప్పుడు బాల‌య్య‌లో తెలియ‌ని ఊపు వ‌చ్చి చిన్న‌పాటి స్టెప్పులు కూడా వేస్తున్నారట. టాలీవుడ్ జనం మాట్లాడుకున్నట్లు వీరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవ‌న‌టానికి ఇదొక ప్ర‌త్యేక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పవచ్చు.

Related

  1. ఖైదీ నెంబర్.150 గురించి చెప్పిన సెన్సార్‌ సభ్యులు!
  2. ఖైదీ, శాతకర్ణి సినిమాల ప్లసులు, మైనస్‌లు!
  3. బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!
  4. ఖైదీ నంబర్ 150 మూవీ మొదటి రివ్యూ!

Facebook

Videos