ఖైదీ నంబ‌ర్ 150 లో అతి పెద్ద మైనస్ ఇదే!

big minus in khadi no 150 movie

మెగాస్టార్ చిరంజీవి చాలా పెద్ద గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ఖైదీ నెం.150. ఈ సినిమా భారీ అంచనాలతో బుధ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4500 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఖైదీ నెం.150 ఒకరోజు ముందే యూఎస్‌లో రిలీజ్ అయ్యింది. ఇక టాక్ కూడా తెలిసిపోయింది. మొదటి షోకే సినిమాకి మంచి హిట్ టాక్ రావడంతో బాస్ ఈజ్ బ్యాక్ అని అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఈ ఖైదీ నెం.150 లో చిరు మార్క్ డాన్స్ లు కనిపించాయి.

ఓ సాంగ్ లో తనయుడు రామ్ చరణ్ తో కలిసి చిరు డాన్స్ వేసిన తీరు అద్భుతంగా ఉంది. ఖైదీ నెం.150 చిత్రంలో అన్ని బాగున్నా ఒక్కటే మైనస్ గా మారింది. ప్రేక్ష‌కుల‌కు బాగా కావాల్సిన కామెడీ ఈ చిత్రంలో పెద్దగా పండలేదని అంటున్నారు. స్టార్ కమెడియన్లు ఆలీ, బ్రహ్మానందం ఉన్నా.. పెద్దగా కామెడీ పండలేదట. సందర్భం లేకుండా వచ్చే కామెడీ సీన్స్ విసుగు తెప్పించాయి. ఇక చిరు, కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు కూడా ఆస‌క్తిగా లేవు.

మొత్తంగా చూస్తే.. వినాయక్ ఈ చిత్రంను నడిపించిన తీరుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక క‌మెడియ‌న్స్‌ను అంద‌రిని చిత్రంలో పెట్టిన ఆ కామెడీయే సినిమా ప్లోకు మైన‌స్‍గా మారింది. బ్ర‌హ్మీ కామెడీ ప్లాప్ అవ్వ‌గా, పోసాని కాస్త‌లో కాస్త బెట‌ర్‌. 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వి సీన్లు చాలా వ‌ర‌కు క‌ట్ అయిపోయాయి. ఓవ‌రాల్‌గా ఖైదీ నెం.150 కు హిట్ టాక్ వ‌చ్చినా కామెడీని డీల్ చేయ‌డంలో వినాయ‌క్ ప్లాప్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.

Related

  1. ఖైదీ నంబర్ 150 చిత్రం రివ్యూ 
  2. ఖైదీ నెంబ‌ర్ 150.. ఒక్కో ఎంతో తెలుస్తే షాక్ అవుతారు!
  3. ఖైదీ పాటలకు స్టెప్పులు వేసిన బాలయ్య!
  4. లీకైన ‘ఖైదీ నెం.150’ మూవీ సాంగ్.. డాన్స్ తో అదరగొట్టిన చిరు, కాజల్!

Facebook

Videos