షాకింగ్: అప్పుడే నెట్ లో హల్ చల్ చేస్తున్న ఖైదీ నంబర్ 150

khaidhi no 150 movie leaked

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా మొత్తానికి విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ థియేట‌ర్ల‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4500 థియేట‌ర్ల‌లో విడుదల అయ్యింది. ఇక ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలతో..  1.2 మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

పూర్తి లెక్క‌లు అందే స‌రికి అక్క‌డ ఖైదీ బాహుబ‌లి ప్రీమియ‌ర్ షో క‌లెక్ష‌న్ల రికార్డు అయిన 1.3 మిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటేస్తుంద‌ని కూడా లెక్క‌లు వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘ఖైదీ నంబర్ 150’కి మంచి టాక్ వచ్చింది. బాస్ రీ ఎంట్రీ చిత్రంను ఓ రెంజ్ లో ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు ఈ సినిమా మొదటి రోజే పెద్ద షాక్ తగిలింది. టాలీవుడ్లో పెద్ద సినిమాల‌ను విడుదలకు ముందే వెంటాడుతోన్న పైర‌సీ భూతం ఖైదీ నెంబ‌ర్ 150కి మొదటి రోజే  ప‌ట్టుకుంది.

ఖైదీ ప్రీమియ‌ర్ షో అలా ప‌డిందో లేదో.. ఖైదీ సినిమాలో టాప్ లేపుతోన్న అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ అప్పుడే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సాంగ్‌ను ఎవ‌రో థియేట‌ర్లో త‌మ సెల్‌ఫోన్‌తో షూట్ చేసి సోష‌ల్ మీడియాలో లీక్ చేసేశారు. ఈ సాంగ్‌లో మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ సైతం స్టెప్పులు వేస్తాడు. ఈ పాటతో పాటు చిరు ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ కూడా లీక్ అయ్యింది. క‌త్తి శీను శంక‌ర్‌లా మారే సీన్‌ను కూడా లీక్ చేశారు. ఇక ర‌త్తాలు ఐటెం సాంగ్ కూడా లీక్ అయ్యింది. ఓవ‌రాల్‌గా 15-20 నిమిషాల సీన్లు లీక్ అయ్యాయి. ఖైదీ లీక్ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మరి దీనిపై ఈ సినిమా నిర్మాత చరణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.

Related

  1. ఖైదీ సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!
  2. ఖైదీ నంబర్ 150 చిత్రం రివ్యూ 
  3. ఖైదీ నంబ‌ర్ 150 లో అతి పెద్ద మైనస్ ఇదే!
  4. ఖైదీ ని అభిమానులతో చూసిన మెగా ఫ్యామిలీ!

Facebook

Videos