శాతకర్ణి పై వర్మ కామెంట్స్.. ఖైదీ పై సెటైర్స్

ram gopal varma intresting tweet on gautamiputra satakarni

మాములుగా వర్మ పలానా చిత్రం బాగుంది అని చెప్పిన సందర్భాలు చాలా తక్కువే. నాకు నా చిత్రాలే నచ్చవు.. ఇక వేరే సినిమాలు ఎలా నచ్చుతాయి అని పలు సందర్భాలలో చెప్పాడు. కాని నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్న వర్మ తాజాగా ఆ సినిమా విడుదల కావడంతో.. బాలయ్యపై ప్రశంసల జల్లు కురిపించారు.

తన తీర్పు నిజం కావడం చాలా థ్రిల్‌గా ఉందన్నారు. యదార్థ కథతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఆకాశానికి తీసుకెళ్లారని ఇందుకు దర్శకుడు క్రిష్‌, బాలయ్యకు తాను సెల్యూట్‌ చేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు క్రిష్‌కు, బాలయ్యకు 100 చీర్స్‌ అని ట్వీట్‌ చేశారు. అంతవరకు బానే ఉన్నా.. పనిలో పనిగా ఖైదీ నెం.150 సినిమాపై కామన్‌గా సెటైర్స్ వేసేశాడు. అరువు తెచ్చుకున్న కథతో కాకుండా.. బాలకృష్ణ 100వ చిత్రం 150 సార్లు గొప్ప చిత్రంగా నిలిచిందనే అర్థం వచ్చే విధంగా ట్వీట్ చేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు వర్మ. అయితే ఖైదీ సినిమాకి మంచి టాక్ వస్తున్న వర్మ ఇలాంటి కామెంట్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. 

Related

  1. ఖైదీ నంబ‌ర్ 150 లో అతి పెద్ద మైనస్ ఇదే!
  2. శాత‌క‌ర్ణి సినిమాలో పెద్ద మైనస్ ఇదే!
  3. గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ!
  4. ఖైదీ సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!

Facebook

Videos