బాలయ్య కొత్త సినిమా వీడియో నెట్ లో లీక్

balayya babu puri jagannadh movie making leaked

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరివేగంగా జరుగుతోంది. గతవారం షూటింగ్ హైదరబాద్ లో ఓ పాట షూటింగ్ చేశారు. ఈ సాంగ్ షూట్ కంప్లీట్ అవ్వగానే.. రెస్ట్ తీసుకోకుండా తదుపరి షెడ్యూల్ ను పోర్చ్ గల్ లో షూట్ చేస్తున్నారు. 40 రోజుల పాటు ఇక్కడ షూట్ చేయబోతున్నారు.

అయితే ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటూ.. ఓ భారీ ఫైట్.. మూడు పాటలను షూట్ చేయబోతున్నారు. నిన్నటి నుంచి బాలకృష్ణ, శ్రియాలపై ఓ సాంగ్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. అయితే ఈ పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.


ఈ వీడియో లీక్ కావడం వల్ల బాలయ్య అభిమానులు బాధపడుతున్నప్పటికి.. బాలయ్య లుక్ చూసి మరో పక్క సంతోషపడుతున్నారు. బాలకృష్ణను పూరి స్టైలీష్ లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాట తర్వాత హెలికాఫ్టర్ తో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ను హాలీవుడ్ నిపుణుల పర్వవేక్షన్లో షూట్ చేయనున్నట్లు తెలిసింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related

  1. బాహుబలి విలన్ అల్లు అర్జున్.. నెట్ లో హల్ చల్
  2. కట్టప్పతో శివగామి రొమాన్స్.. నెట్ లో వీడియో హల్ చల్
  3. నెటి జ‌న్ల‌కు జ‌గ‌న్ పిలుపు..... నేను అండ‌గా ఉంటా..
  4. అనుష్క పర్సనల్ విషయాలను లీక్ చేసింది ఎవరో తెలుసా..?

Facebook

Videos