షాక్ : గోవా బీచ్‌లో నాగచైతన్య, సమంత

Naga Chaitanya and Samantha marriage in goa

అక్కినేని హీరో నాగచైతన్య.. అందాల భామ సమంతల వివాహ నిశ్చితార్థం అయ్యి చాలా నెలలు కావస్తోంది. అయితే వీరి పెళ్లిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో అక్కినేని ఫ్యాన్స్‌ నాగచైతన్యసమంతల పెళ్లిపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టైంలోనే వీరి వివాహం బ్యాంకాక్‌లోని ఒక ఐలాండ్‌లో జరగబోతున్నట్లు వార్తలు జోరుగా వచ్చాయి.

అయితే తాజాగ్ అక్కినేని కుటుంబ సన్నిహితులు, చైతూకు సన్నిహితంగా ఉండే కొందరు ఆ వార్తలను కొట్టి పారేశారు. చైతూ వివాహం విదేశాల్లో అన్నది నిజం కాదు అని వారు తేల్చి చెప్పారు. బ్యాంకాక్‌ వార్తలపై క్లారిటీ వచ్చిన క్రమంలో  ఇప్పుడు కొత్తగా చైతూ, సమంతల పెళ్లి గోవా బీచ్‌లో అంటూ ప్రచారం స్టార్ట్ అయింది.

అక్టోబర్‌ 6న చైతూ, సమంతల పెళ్లి గోవా బీచ్‌లో నిర్వహించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారని, మొదట గోవా చర్చ్‌లో క్రిస్టియన్‌ పద్దతిలో వివాహం జరిపి, ఆ తర్వాత హిందూ పద్దతిలో వివాహం నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంగతిపై క్లారిటీ రావాల్సి ఉంది. పెళ్లి ఎక్కడ జరిగినా కూడా హైదరాబాద్‌లో ఫ్యాన్స్‌ కోసం భారీ ఎత్తున రిసెప్షన్‌ ఏర్పాటు చేసే ఛాన్సులు ఉన్నాయి. 

Related

  1. సమంత బాహుబలి-2 కి వెళ్లి.. మధ్యలోనే ఎందుకు బయటకు వచ్చిందొ తెలుసా..?
  2. సమంత వల్ల.. చరణ్ సినిమాకు అలా అయింది..?
  3. కుర్ర హీరో విజయ్‍తో సమంతతో రొమాన్స్
  4. చైతూ ఇలా అనేసరికి.. సమంత ఏమన్నాదో తెలుసా..?

Facebook

Videos