పవన్ కళ్యాణ్ సినిమాలో నాగ చైతన్య..?

chaitu doing in pawan movie

పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న మూవీలో అక్కినేని హీరో నటించడం ఏంటి అని అనుకుంటున్నారా..? ఇది మల్టీస్టారర్ మూవీ అని షాక్ కాకండి. అసలు విషయం వేరే ఉంది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం.. త్వరలో రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే.

ఈ నెల 26న రిలీజ్ కు రెడుతున్న ఈ సినిమాపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. నిజానికి ఇది నిన్నే పెళ్లాడతా కథను కాస్త అటు ఇటు మర్చి తీసారని, ఓ దశలో ఈ సినిమాకు నిన్నే పెళ్లాడతా అనే టైటిల్ కూడా పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి ? అయితే ఇప్పుడు మరో కొత్త టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన అక్కడ అమ్మాయి .. ఇక్కడ అబ్బాయి సినిమా కథ ఇదేనని, దాన్ని కొద్దిగా మర్చి ఈ సినిమాగా తెరకెక్కించారని అంటున్నారు.

అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ గా అక్కినేని వారమ్మాయి .. సుప్రియ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. హీరో, హీరోయిన్ కుటంబాల మధ్య పల్లెటూర్లలో వైరం ఉండడం .. అది తెలియక ఇద్దరు ప్రేమలో పడడం అనే పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని టాక్. మరి పవన్ కళ్యాణ్ సినిమానా, లేక నిన్నే పెళ్లాడతా సినిమానా అనేది తెలియాలంటే రారండోయ్ వేడుక చూద్దాం రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. 

Related

  1. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్
  2. పవన్ కళ్యాణ్ ఒక బాహుబలి.. రాజమౌళి దర్శకత్వం పక్కా..?
  3. ఘోరం : చిరు, పవన్ ఫ్యాన్స్.. బాహుబలి 2 కి చూడొద్దంటూ.. ప్రచారం
  4. యాక్సిడేంట్ అయిన కారుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇదే

Facebook

Videos