ఏటీఎం నుంచి విత్‌డ్రాపై గుడ్ న్యూస్!

no withdrawl limit in atm

నోట్ల రద్దు చేసిన తర్వాత డబ్బుల గురించి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అయితే ఏటీఎంల్లో నగదు లావాదేవీలపై కేంద్రం కొంత పరిమితి పెట్టిన విషయం తెలిసిందే. రోజుకు 2,500 రూపాయల నగదును మాత్రమే అందించిన ఆర్బీఐ.. ఇక నుంచి ఈ నిబంధనను తొలిగించనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 30 తర్వాత ఏటీఎంల్లో లావాదేవీలపై విధించిన పరిమితిని ఎత్తివేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు. డిసెంబర్ 30 లోపు పరిస్థితులు సాధారణ స్థితిలోకి వస్తాయని ఆశిస్తున్నామని, ఇప్పటికే చాలాచోట్ల బ్యాంకు సేవలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ నిర్ణయం చర్చల దశలో ఉందని చెప్పారు. ఆర్థిక కార్యదర్శి అశోక్ లవస డిసెంబర్ 16న చేసిన ఓ ప్రకటన కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. డిసెంబర్ 30 తర్వాత వితజ్ డ్రా పరిమితులపై సమీక్షిస్తామని ఆయన గతంలో ప్రకటించారు.

Related

  1. ఏటీఎం వద్దకు వెళ్లకుండా.. డబ్బు తెచ్చుకుంటున్నారు!
  2. జర జాగ్రత్త.. గురూ.. ఏటీఎంల నుంచి రంగు వెలసిన నోట్లు!
  3. ఏ.టి.ఎం పిన్ మర్చిపోతే ఇలా చేయండి!
  4. రష్మీకి ఫోన్ చేసి ఏడిపిస్తుంది ఎవరు?

Facebook

Videos