101ఏళ్ళ వృద్దుడిపై అత్యాచారం కేసు.. 13 సంమవత్సరాల జైలు శిక్ష

a 101 year old man has been jailed for 13 years for a crime

నేరాలు చేసి తప్పించుకుందాం అని చాలామంది అనుకుంటారు. మనల్ని ఎవరూ పట్టుకోలేరు అనే ధైర్యంతోనే చాలామంది నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. కానీ ఏదోఒక రోజు వాళ్ళు చేసిన పాపాలు బయట ప్రపంచానికి తెలిసి శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. 

బర్మింగ్ హామ్ లో 101 సంవత్సరాల వృద్దుడికి 40 సంవత్సరాల క్రితం చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష విధించారు. రాల్ఫ్ క్లార్క్ అనే 101 సంవత్సరాల వృద్ధుడుకి బ్రిటిష్ కోర్ట్ 13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. క్లార్క్ 60 సంవత్సరాల వయస్సులో అంటే 1970 లో 4 ఏళ్ళు..., 13 ఏళ్ళు... ఉన్న ఇద్దరు అక్క చెల్లెళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తరువాత కూడా చాలామందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఇన్నాళ్లూ తప్పించుకున్నాడు.

ఇటీవల క్లార్క్ తన 100వ పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకున్నాడు. అప్పుడు తీసిన ఫోటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఒకప్పుడు అతని బారిన పడిన అక్కాచెల్లెళ్లు ఆ ఫొటోస్ చూసి పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇపుడు ఆ అక్కాచెల్లెళ్ల వయసు 40 సంవత్సరాలు. అయినా అక్కడి పోలీసులు కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. ఆతను రిమాండ్ లో ఉన్నపుడు కూడా కొద్దీ రోజుల క్రితం ఒక చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఇంకొక కేసు నమోదు చేశారు. అతని దారుణాలు బయట పడడంతో కోర్ట్ క్లార్క్ కి 13 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 


Facebook

Videos