" కెసిఆర్ కి ఆంధ్రా వాళ్ళు అంటేనే ప్రేమ "

Revanth Reddy Fires on KCR

దళితుల విషయం లో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు రకాలుగా మాట్లాడుతున్నారు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఈ విషయం లో ఆయన మీద సీరియస్ వ్యాఖ్యలు చేసారు. దళితుల ని పట్టించుకోవడం లో ఆయన మినిమం కేర్ చూపించడం లేదు అనేది రేవంత్ ఆరోపణ.

ఆంధ్రా ప్రాంతవాసులపై అభిమానం చూపుతూ తెలంగాణ బిడ్డలపై సవతి ప్రేమ చూపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డలు పూర్ణ - ఆనంద్ లకు రూ. 25 లకల బహుమానాన్ని ఇచ్చామని సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారని అయితే తెలంగాణకు సంబంధంలేని పీవీ సింధుకు రూ. 4 కోట్ల బహుమానాన్ని ఇవ్వడంతో పాటు హైదరాబాద్ నగరంలో రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కూడ కానుకగా ఇచ్చారని రేవంత్ గుర్తుచేశారు.

సానియా మీర్జా కోసం కూడ సీఎం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. ఈ ప్రాంతానికి చెందని పీవీ సింధుకు కోట్ల రూపాయల విలువైన 1000 గజాల స్థలాన్ని కేటాయించిన కేసీఆర్ - తెలంగాణ బిడ్డలైన పూర్ణ - ఆనంద్ లకు కనీసం 200 గజాల స్థలాలనైనా ఇచ్చారా? అని రేవంత్ నిలదీశారు. 


Facebook

Videos