వాజ్ పాయి మీద అద్వానీ చేసిన భారీ కుట్ర

Vajpayee feared coup by Advani camp in 2002 says new biography

కొన్ని విషయాలు షాకింగ్ గా అనిపిస్తాయి. ప్రత్యక్షంగా వాటిని చూసినవాళ్ళు లాజిక్ తో ప్రూఫ్ తో సహా మనకి చెబితే నిజమే కదా అనిపిస్తుంది. నరేంద్ర మోడీ ప్రధాని గా పీఠం ఎక్కేవరకూ బీజేపీ అగ్రనేతలు గా ఉన్న మాజీ ప్రధాని వాజ్ పాయ్ - ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ల మధ్యన కుట్ర రాజకీయాలు జరిగాయి అనేది ఎప్పటి నుంచో ఉన్న పెద్ద డిస్కషన్.వాజ్ పేయిని గద్దె దించేందుకు అద్వానీ కుట్ర చేశారని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ పీ ఉల్లేఖ్ రాసిన "ది అన్ టోల్డ్ వాజ్ పేయి; పొలిటియన్ అండ్ పారడాక్స్" పుస్తకంలో వెల్లడించారు.

ఉల్లేఖ్ రాసిన పుస్తకం ప్రకారం ఎన్డీఏ నాయకుడిగా వాజ్ పేయి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఆయన్ను గద్దె దింపి అద్వానీని ప్రధానిగా చేయాలని కుట్ర జరిగిందట. ఈ విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న ప్రధానమంత్రి వాజ్ పేయి ఆ సమయంలో తన దగ్గరకు వచ్చిన ఓ మంత్రితో ఈ కుట్రను పంచుకున్నారట. అయితే సదరు మంత్రి ఎల్ కే అద్వానీ కేంద్రంగా ఇలాంటి కుట్ర జరుగుతుందని తమకు సైతం అవగాహన ఉందని చెప్పడంతో వాజ్పేయి ఒకింత షాక్కు గురయ్యారట. అయితే ఈ కుట్ర తాలుకూ తదనంతర పరిణామాలు తెలుసుకునేందుకు వాజ్ పేయి ప్రయత్నించారట.


Facebook

Videos