హ్యూమన్ బాడీలో కొత్త పార్ట్... అది ఏంటో తెలుసా?

mesentery new organ discovered inside human body by scientists

ఏంటి హ్యూమన్ బాడీలో కొత్త పార్టా … అని ఆశ్యర్యపోతున్నారు కదూ.. మీరు విన్నది నిజమే.. మానవ శరీరంలో మరో కొత్త అవయవాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ అవయవాన్ని  జీర్ణ వ్యవస్థలో గుర్తించారు. శరీరంలో పొత్తి కడుపును, పేగును కలిపి ఉంచే ఈ అవయవం పేరు మెసెంటరీ. సైన్స్ పుట్టినప్పటినుండి దీనిని జీర్ణ వ్యవస్థలోని కొన్ని అవయవాల్లో అంతర్భాగంగానే భావిస్తూ వచ్చారు.

అయితే తాజాగా ఇది ఒక డిఫరెంట్ బాడీ పార్ట్ అని ఐర్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ లైమ్‌ రిక్‌ శాస్త్రవేత్త కెల్విన్‌ కొఫే తెలిపారు. దీనిని గుర్తించడం ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించిన  వ్యాధులకు మెరుగైన వైద్యం చేయవచ్చన్నారు. మెసెంటరీ లక్షణాలను, పనితీరును ఇంకా కొంచెం అధ్యయనం చేయాల్సి ఉందని కెల్విన్‌ చెప్పారు. ఇది పూర్తయితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన శస్త్రచికిత్సలను తగ్గించడంతో పాటు, చౌకైన వైద్యం అందుబాటులోకి తీసుకుని రావొచ్చని ఆయన వెల్లడించారు. ఈ పరిశోధన సక్సెసైతే  మెడికల్ సిలబస్‌ (అనాటమీ)ని తిరగరాయాల్సి ఉంటుందని తెలిపారు.  


Facebook

Videos