అక్టోబర్ లో భూమి అంతం కానుందా?.. బైబిల్ ఏమి చెబుతోంది..?

earth will destroy in october

త్వరలోనే భూమి అంతం కానుందని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. 2012లో దీని  ప్రభావం తీవ్రంగా కనిపించినా ఎలాంటి విపత్తులు సంభవించకపోవడంతో అంతా  ఊపిరి పీల్చుకున్నారు. అయితే  తాజాగా 2017లో భూమికి అంతరించిపోయే రోజులు దగ్గర పడుతున్నాయని డేవిడ్ మీడే అనే రచయిత “ప్లానెట్ టెన్- ది 2017 అరైవల్” అనే పుస్తకంలో వెల్లడించారు.  పదో గ్రహమైన నిబిరు భూమి వైపు దూసుకొస్తుందని స్పష్టం చేశారు.

వందేళ్ల క్రితం కక్ష్యలోని ఇతర గ్రహాలను నిబిరు అనే గ్రహం విచ్ఛిన్నం చేసింది. ఇది ప్రస్తుతం సౌరవ్యవస్థలో పదో గ్రహంగా పరిగణింపబడుతోంది. ఈ గ్రహం తానొక్కటే కాకుండా తనతో పాటు మరో ఏడు విచ్ఛిన్న గ్రహాలను కూడా వెంటబెట్టుకుని వస్తోందని, అక్టోబర్ లో భూమిని ఢీ కొట్టనుందని పలువురు  శాస్త్రవేత్తలు కూడా అంచానా వేస్తున్నారు.  అయితే  నిబిరు గ్రహం ఏ దిశగా వస్తుందనే విషయాన్ని గుర్తించడం కష్టమని, కానీ జరుగుతుందని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని డేవిడ్ చెప్తున్నారు. కానీ దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రదేశాల్లో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తే నిబిరు రాకను కనిపెట్టవచ్చని వెల్లడించారు. ఈ వాదనకు మతపరమైన అంశాలు కూడా తోడు అయ్యాయి. ఈ విషయం క్రైస్తవ పవిత్ర గ్రంథమైన బైబిల్‌లో కూడా ఉందంటున్నారు. అయితే ఈ వార్తలను నాసా కొట్టి పారేయడం గమానార్హం.


Facebook

Videos