అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్

pawan kalyans first win

జనసేన పార్టీ అధ్యక్షుడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటంలో మొదటి సక్సెస్ అందుకున్నాడు. ఉద్దానం బాధితుల సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం.. చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు పవన్.. బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించటం హర్షణీయమన్నారు.

ఉద్దానం బాధితులకు ప్రభుత్వం మంచి సహాయ చర్యలు చేపట్టడం తమ మొదటి సక్సెస్ అని.. ఈ విషయంలో తమతో వచ్చిన మీడియాకు థాంక్స్ చెప్పారు పవన్ కళ్యాణ్. అలాగే ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం .. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల విజ్ఞప్తి చేయడం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం-ఇచ్చాపురంలో పర్యటనలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కిడ్నీవ్యాధి వారికి తక్షణసాయం అందించాలని కోరారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ఓ ప్రకటన తెలుపుతూ.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉద్దానంలో కూడా కుప్పం తరహా మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఈ నెల 26వ నాటికి బాధిత గ్రామాలకు మంచి నీరు అందించాలని సుచించారు చంద్రబాబు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనపై పవన్ కళ్యాణ్ సంతోషంను వ్యక్తం చేశారు.

Related

  1. నడిసొచ్చే నర్తన శౌరి.. పవన్ న్యూ ఇయ‌ర్ కానుక‌
  2. పవన్ చేయబోయే చివరి సినిమా అదేనా..?
  3. బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!
  4. పవన్ సరసన యాంకర్ అనసూయ!

Facebook

Videos