'గొడుగు హత్య' తరహాలో ప్రేయసి భర్తను హత్య చేసిన ప్రియుడు

delhi gym trainer master plan for ex love

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ ఏమైందో ఏమో వారిద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లి అయిపోయింది. కానీ ఆ యువకుడు మాత్రం తన ప్రేయసిని మర్చిపోలేక ఆమెను దక్కించుకోవడానికి తన భార్యకు విడాకులు ఇచ్చి ప్రేయసిని భర్తను హత్య చేయించాడు. కానీ అతని పాపం పండి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఇలాంటి ఘటనలు మన దేశంలో చాలానే జరిగాయి కానీ ఈ సంఘటన మాత్రం వాటన్నిటికీ కొంచెం భిన్నంగా జరిగింది. 1978 నాటి 'గొడుగు హత్య' ల తరహాలో ప్రేయసి భర్తను దారుణంగా హత్య చేయించాడు. 

ఢిల్లీలోని సదర్ బజార్ లో నివసించే రవికుమార్ (27) అనే వ్యక్తి కోటక్ మహీంద్రా బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రిందట అదే ప్రాంతానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. శనివారం సాయంత్రం సినిమాకు వెళ్లిన రవికుమార్ ను ఫాలో అవుతూ వచ్చిన ఒక వ్యక్తి అతని వెనుక సీట్లోనే కూర్చున్నాడు. రవికుమార్ యూ మెడలో ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. వెనుక ఉన్న వ్యక్తి అతని మెడలో విషం ఇంజెక్ట్ చేసాడు. రవికుమార్ స్పృహ కోల్పోతూ కూడా హంతకుణ్ణి పెట్టుకోవద్దని ప్రయత్నించాడు. ఇదంతా చూస్తున్న మిగిలిన వాళ్ళు హంతకుణ్ణి పట్టుకుని రవికుమార్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అతనికి ఇంజెక్ట్ చేసింది అత్యంత ప్రమాదమైన విషం కావడంతో అతను ప్రాణాలు వదిలాడు.

హంతకుణ్ణి పట్టుకున్న పోలీసులు అతనిని విచారించగా అతను ప్రొఫెషనల్ కిల్లర్ ప్రేమ్ గా గుర్తించారు. మృతుడి భార్యను ప్రేమించిన అనీష్ యాదవ్ అనే వ్యక్తి రవికుమార్ ను చంపడానికి 1.5 లక్షలు ఇచ్చాడని తెలిపాడు. దీంతో పోలీసులు అనీష్ యాదవ్ ను అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఈ హత్యతో హతుని భార్యకు సంబంధం ఉందా..లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని పోలీసులు తెలిపారు. 1978లో బీబీసీలో రిపోర్టర్ గా పని చేస్తున్న వ్యక్తి రోడ్ పై నడుచుకుంటూ వెళ్తుండగా గొడుగుతో పొడిచి చంపాడు. ఈ గొడుగు ముందు భాగానికి విషం పూసి ఉండడంతో అతను కొన్ని నిముషాల వ్యవధిలోనే మరణించాడు. అప్పటినుండి ఈ తరహా హత్యలను 'గొడుగు హత్య' లు అంటారు.


Facebook

Videos