బాలయ్య కి చంద్రబాబు సంక్రాంతి సూపర్ కానుక

Chandrababu Naidu Sankranti Gift to Balakrishna

ఈమధ్య కాలంలో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయా భారీ సినిమాలకు సంబందించిన నటులో - దర్శకులో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా కలవడం వెంటనే ఆ సీఎంలు సదరు చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతూనే ఉంది.

ఈ క్రమంలో తాజాగా బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపునిచ్చింది ఏపీ ప్రభుత్వం! దీంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి కానుక ఇచ్చారనే అనుకోవాలి!

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని తెలుస్తోంది! కాగా నాలుగు రోజుల క్రితం ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా పన్ను మినహాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత శుక్రవారం.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. చారిత్రక సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మినహాయింపు ఇస్తున్నామని దీనిని తెలంగాణ ప్రభుత్వం ఓ పాలసీగా పెట్టుకుందని కేసీఆర్ చెప్పడం తెలిసిందే. అనంతరం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణలో రాయితీ ఇచ్చినందుకు స్వయంగా బాలయ్య కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే!


Facebook

Videos