మురుగదాస్ కి ఖైదీ సినిమా ఎందుకు నచ్చలేదంటే..?

Murugadoss Not Like Some Scenes in Khaidi No 150

మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. ఇప్పుడు ఈ చిత్రం సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా.. పండుగ సీజన్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకోవడం ఖాయం అని అంటున్నారు.

ఖైదీ నంబర్ 150.. తమిళ చిత్రం కత్తికి రేమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మురుగదాస్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మురుగదాస్ మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తూ హైద్రాబాద్ లోనే ఉన్నాడు. అంతేకాదు.. ఖైదీ నంబర్ 150మూవీని చూసి తెగ ఆశ్చర్యపోయాడట. ముఖ్యంగా ఈ సినిమాలో ఆల్కహాన్ సీన్స్ చూసి బాగా డిజప్పాయింట్ అయ్యాడట ఈ దర్శకుడు. తమిళ్ కత్తిలో కూడా విలన్ గ్రీన్ టీ తాగుతున్నట్లు చూపిస్తారు తప్ప.. ఆల్కహాల్ కనిపించదు.

కానీ తెలుగులో మాత్రం చిరంజీవి.. ఆలీ.. బ్రహ్మానందంల మధ్య లిక్కర్ తో కామెడీ ట్రాక్ చూసి.. అసలు దీని అవసరం ఏంటి అని ఫీలయ్యాడట మురుగదాస్. అలాగే ఆలీతో లేడీ గెటప్ వేయించిన సన్నివేశంపై కూడా ఆశ్చర్యపోయాడట. ఈ మార్పల గురించి ముందు డిస్కస్ చేసినా.. సినిమాలో వాటిని చూసి షాక్ తినేశాడని తెలుస్తోంది. తమిళ్ సినిమాని ఆడియన్స్ కోసం తిరిగి మార్చి రాయడం అంటే.. మెగాస్టార్ కోసం అదనపు హంగులు చేకూర్చడం అంటే ఏంటో.. ఇప్పుడు మురుగదాస్ కి మంచిగా అర్ధం అయుంటుంది. 

Related

  1. ఖైదీ నంబ‌ర్ 150 లో అతి పెద్ద మైనస్ ఇదే!
  2. ఖైదీ ని అభిమానులతో చూసిన మెగా ఫ్యామిలీ!
  3. ఖైదీ నంబర్ 150 చిత్రం రివ్యూ 
  4. షాకింగ్: అప్పుడే నెట్ లో హల్ చల్ చేస్తున్న ఖైదీ నంబర్ 150

Facebook

Videos