గృహ‌రుణాల వ‌డ్డీరేట్ల‌ను త‌గ్గించిన యాక్సిస్‌బ్యాంక్‌

Axis Bank cuts home loan rates by 30 bps

దేశంలో ప్ర‌ముఖ బ్యాంక్‌ల‌న్నీ త‌మ ఖాతారుల‌కు ఇచ్చే గృహ‌రుణాలపై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిం మొద‌లు పెట్టారు.ప్ర‌భుత్వ బ్యాంకింగ్ దిగ్గ‌జం ఎస్‌బీఐ,ఐపిఐసిఐ బాట‌లో ఇప్పుడు దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు వడ్డీరేట్లపై గుడ్ న్యూస్ చెప్పింది.

గృహరుణాలపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అఫార్డబుల్ హౌజింగ్ ఫైనాన్స్ ను అందించే లక్ష్యంతో రేట్లను సమీక్షించినట్టు బ్యాంకు చెప్పింది. దీంతో 30 లక్షల వరకున్న శాలరీ సెగ్మెంట్లో గృహరుణాలపై వడ్డీరేటు 8.35 శాతానికి దిగొచ్చింది.

ఇండస్ట్రీలోనే ఇవే అత్యంత కనిష్టస్థాయి. 2017 మే 16 నుంచి ఈ సమీక్షించిన వడ్డీరేట్లు అందుబాటులోకి వస్తున్నాయని బ్యాంకు చెప్పింది. ఇప్పటివరకు 75 లక్షల వరకున్న గృహరుణాలపై 8.65 శాతం వడ్డీరేట్లున్నాయి. ప్రస్తుతం ఈ వడ్డీరేట్లను 8.35శాతానికి తగ్గించింది. ఈ బ్యాంకు ప్రత్యర్థులు స్టేట్ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కూడా గతవారంలోనే తమ వడ్డీరేట్లను తగ్గించాయి.

Also read

  1. గృహ‌రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఐసిఐసిఐ
  2. రూ200 నోటును మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ క‌స‌ర‌త్తు
  3. ఎస్‌బీఐ గృహ‌రుణ.. ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌
  4. టూవీల‌ర్ అమ్మ‌కాల్లో.. భార‌త్ ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1

Facebook

Videos