ఉత్త‌ర‌కొరియ‌వైపు క‌దిలిన అమెరికామ‌రోయుద్ధ నౌక‌

US Navy moves second aircraft carrier to North Korea doorstep

ఉత్త‌ర‌కొరియా-అమెరికాల మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌నం ముదురుతోందా...? అమెరికా హెచ్చ‌రిక‌ల‌ను ఉత్త‌ర‌కొరియాఖాత‌రు చేయ‌డంలేదా..? అణుప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తూ పెద్ద‌న్న‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందా...?

ఉత్త‌ర కొరియాకు త‌న సత్తా చూపించాలని అనుకుంటుందా? ప‌రిస్తితులు అలానే క‌నిపిస్తున్నాయి.అమెరికాపై అణుబాండులు వేస్తామంటూ పెద్ద‌న్న‌ను రెచ్చ‌గొడుతోంది ఉత్త‌ర కొరియా..
ఉత్తరకొరియా , అమెరికాల మధ్య ఇన్నాల్లు మాట‌ల‌యుద్ద‌మే కొన‌సాగింది..కాని ఇప్పుడు చేతుల్లో చూపించేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అమెరికా హెచ్చ‌రిక‌న‌లు ఏమాత్రం ఖాత‌రు చేయ‌కుండా ఖండాంత‌ర అణుప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తూ పెద్ద‌న్న‌కు కొపం తెప్పిస్తోంది. ఇక ఉపేక్షించేదిలేద‌ని త‌న‌స‌త్తా చూపించేందుకు సిద్ద‌మ‌వుతోంది అగ్ర‌రాజ్యం.

ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం కాస్త కష్టంగానే ఉంది. రెండు దేశాల‌మ‌ధ్య మధ్య కానీ యుద్ధం వస్తే... అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి. తాజాగా అమెరికా కీలక మైన యుద్ధనౌకను కొరియా తీరాలకు పంపించింది.ఇప్ప‌టికే కొరియా స‌ముద్ర‌జ‌లాల్లో యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్ యుద్ధ‌నైక సిద్ధంగా ఉంది. యూఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌ యుద్ధనౌక ఉత్తరకొరియా సముద్రతీరాలకు చేరుకుంటోంది. అంతే కాదు రీగన్ తో పాటూ మరో రెండు భారీ నౌకలు కూడా దాని వెంట వెళుతున్నాయి. ఉత్తరకొరియాను భయపెట్టడానికే అమెరికా అన్నింటినీ అక్కడ ప్రదర్శిస్తోందా? లేక యుద్ధానికి సన్నద్ధమైపోయిందో తెలియడం లేదు.

ఈ యుద్ధనౌక అక్కడికి చేరుకోగానే శిక్షణ సంబంధమైన విన్యాసాలను కార్ల్‌ విన్సన్‌తో కలిసి నిర్వహిస్తుందని తెలిపారు. యుద్ధ విమానాన్ని విజయవంతంగా ప్రయోగించడంతోపాటు తిరిగి దానిని సురక్షితంగా దించడం అనే అంశం ప్రధానంగా ఈ విన్యాసాలు ఉంటాయని చెప్పారు.ఇప్పటికే కొరియాతీరంలో రెండు యుద్ధనౌకలు ఉన్నాయి. వాటితో కలిసి రోనాల్డ్ రీగన్ కలిసి పనిచేస్తుంది.ఒక వేల యుద్ధం ప్రారంభ‌మ‌యితే ప్రాణ‌న‌స్టాన్ని ఎవ‌రూ ఊహించ‌లేనంత‌గా ఉండ‌టంతో అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

Also Read


Facebook

Videos